AP JOBS : ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3,282 ఉద్యోగాలపై కీలక ప్రకటన...!!

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. 3,282 ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఉన్న 18 యూనివర్సిటిల్లో మొత్తం 3, 282 అధ్యాపక పోస్టుల భర్తీకి అక్టోబర్ 20న ప్రకటన వెలువరిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కే. హేమచంద్రారెడ్డి తెలిపారు. వీటితోపాటు మరో 70 పోస్టులను డిప్యుటేషన్ పై తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

New Update
TS NEWS: నిరుద్యోగులకు ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్.. అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు..!!

Teaching Jobs in AP: ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. 3,282 ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఉన్న 18 యూనివర్సిటిల్లో మొత్తం 3, 282 అధ్యాపక పోస్టుల భర్తీకి అక్టోబర్ 20న ప్రకటన వెలువరిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కే. హేమచంద్రారెడ్డి తెలిపారు. వీటితోపాటు మరో 70 పోస్టులను డిప్యుటేషన్ పై తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా నన్నయ యూనివర్సిటిలో మాట్లాడారు. అధ్యాపక పోస్టుల భర్తీలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడహాక్ అధ్యాపకులకు 10శాతం మార్కులు వెయిటేజీ ఇవ్వాలని సీఎం నిర్ణయించారని పేర్కొన్నారు. భర్తీ సమయంలో 1:12 వంతున వారి నుంచి మళ్లీ 1:4 నిష్పత్తిలో సెలక్ట్ చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియలో సదరు అధ్యాపకుడు అకడమిక్ గా సాధించిన ప్రగతిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

Official Website: psc.ap.gov.in

ఇది కూడా చదవండి: తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఎన్నికల నేపథ్యంలో ఆ రోజు సెలవు.. కీలక ఉత్తర్వులు జారీ!

ఇక బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి కూడా బోధన సిబ్బంది నియామకంలో అనుసరిస్తున్న విధానాన్ని పాటిస్తామని స్పష్టం చేశారు. ఏ యూనివర్సిటీకి ఎంతమంది బోధనేతర సిబ్బంది అవసరమో లెక్కించి నివేదిక ఇచ్చేందుకు ఉర్దూ యూనివర్సిటీ వీసీ రెహమాన్ తో కమిటీని నియామించాని వెల్లడించారు. కంప్యూటర్ సైన్స్ చదివి విద్యార్థులకు వర్చువల్ విధానంలో ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్ షిప్ చేసే ఛాన్స్ కల్పించనున్నట్లు వివరించారు.

ఇక అటు ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పలు సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేసిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌-ఏపీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి పిలుపునిచ్చింది.

ఇది కూడా చదవండి:  గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే?

ఖాళీల వివరాలు:
అసిస్టెంట్‌ ప్రొఫెసర్ గ్రేడ్‌ -2 (Assistant Professor Grade-II)

24 ఖాళీలు:

ఈసీఈ (ECE), ఈఈఈ (EEE) , బయో టెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, సీఎస్‌ఈ (CSE) , మెకానికల్‌ ఇంజినీరింగ్‌ , హ్యూమానిటీస్‌ అండ్‌ మేనేజ్‌ మెంట్‌, సైన్సెస్‌, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌ విభాగాలకు సంబంధించి మొత్తం 24 ఖాళీలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈ పోస్ట్‌ లకు సంబంధించి ఫస్ట్‌ క్లాస్‌ బ్యాచిలర్‌ డిగ్రీ కానీ, మాస్టర్స్‌ డిగ్రీ కానీ, పీహెచ్‌ డీ ఉత్తీర్ణులు అవ్వడంతో పాటు ఇంతకు ముందు ఎక్కడైనా ప్రొఫెసర్‌ గా పని చేసిన అనుభవం ఉండాలి.

Advertisment
తాజా కథనాలు