Runa mafi: రుణమాఫీ అమలులో 31 సాంకేతిక సమస్యలు.. వ్యవసాయ శాఖ కీలక నివేదిక!

రుణమాఫీ అమలులో 31 సాంకేతిక సమస్యలున్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. పరిష్కారాల్లో కొన్ని ప్రభుత్వ పరిధిలో, మరికొన్ని బ్యాంకుల పరిధిలో ఉన్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికు తెలంగాణ ప్రభుత్వానికి అందించింది.

New Update
Runa mafi: రుణమాఫీ అమలులో 31 సాంకేతిక సమస్యలు.. వ్యవసాయ శాఖ కీలక నివేదిక!

TG Runa mafi: రెండు లక్షల పంట రుణమాఫీ అమలులో 31 సాంకేతిక సమస్యలున్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికు తెలంగాణ ప్రభుత్వానికి అందించింది. అలాగే పరిష్కారాల్లో కొన్ని ప్రభుత్వ పరిధిలో, మరికొన్ని బ్యాంకుల పరిధిలో ఉన్నట్లు పేర్కొంది. సాకేంతిక సమస్యలను వివరించి వీలైనంత త్వరగా పరిష్కారాలు చూపాలని ప్రభుత్వాన్ని కోరింది.

సమస్యలకు పరిష్కారాలు..
ఇందులో భాగంగానే ఖాతాదారు ఆధార్ నంబర్‌తో యాప్‌లో తనిఖీ చేయాలని సూచించింది. టు బీ ప్రాసెస్‌డ్ అని వస్తే మొదటి, రెండో విడతలో మాఫీ కానట్లుగా భావించాలి. మూడో విడతలో అర్హత ఉందా..? లేదా..? అని పరిశీలించాలి. ఇన్‌వ్యాలిడ్ ఆధార్ నంబర్ అని వస్తే బ్యాంకుల ద్వారా సరిచేసే అవకాశమివ్వాలి. నో డేటా ఫౌండ్ అని వస్తే ప్రభుత్వ ప్రామాణికం ప్రకారం రుణఖాతా లేదని భావించాలి. ఆధార్, రుణ ఖాతాల్లో పేరు వేర్వేరుగా ఉంటే బ్యాంకుల ద్వారా అప్‌డేట్ చేసుకునే అవకాశమివ్వాలి. కుటుంబ నిర్ధారణను ఆధార్ ఆధారంగా బ్యాంకులు చేయాలి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా.. సర్వీస్ పెన్షన్ పొందుతున్నా.. రుణమాఫీకి అర్హత ఉండదు. పాస్‌పుస్తకం లేదని వస్తే భార్య/భర్త పేరిట మరో ఖాతా ఉందని తెలపాలి.

రేషన్‌కార్డు లేకపోతే..
ఇక రేషన్‌కార్డు లేకపోతే ఇతర అర్హతల ఆధారంగా రుణమాఫీ చేసేలా ప్రభుత్వం పరిశీలించాలని కోరింది. నగదు రైతు ఖాతాలో జమ కాకపోయినా.. ఖాతా మూతపడినా అర్హుడైతే మరో ఖాతాలో నిధులు జమ చేయాలని సూచించింది. రైతు 2021 కంటే ముందు మరణించినా.. ఆ భూమి వారసులకు పంచి ఇచ్చినా అర్హులకు సాయం అందించాలి. అసలు కన్నా వడ్డీ ఎక్కువగా ఉన్నా.. ఒకే కుటుంబంలో వేర్వేరు రైతులు ఉన్నా బ్యాంకులు పరిశీలించాలి. కుటుంబంలో వేర్వేరు రుణాలు ఉన్నప్పటికీ అందులో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే మాఫీ వర్తించదు. రైతుకు ఒకటి కంటే ఎక్కువ రుణ ఖాతాలున్నా.. ఖాతాతో ఆధార్ లింక్ లేకున్నా బ్యాంకులు పరిశీలించి పరిష్కరించాలంటూ పలు సూచనలతో కూడిన నివేదిక సమర్పించింది.

Advertisment
తాజా కథనాలు