TS News : వాటర్ ట్యాంకులో పడి 30 కోతులు మృతి..! వాటర్ ట్యాంకులో పడి 30కోతులు మృతి చెందిన సంఘటన నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో చోటుచేసుకుంది. విజయ విహార్ సమీపంలో ఉన్న 200 ఇళ్లకు మంచినీరు సరఫరా చేసేందుకు ట్యాంకు నిర్మించారు. ట్యాంకులో నీళ్లు తాగేందుకు ప్రయత్నించిన వానరాలు అందులో పడి మరణించాయి. By Bhoomi 03 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TS News : నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ లోని హిల్ కాలనీలో విషాదం నెలకొంది. మంచినీళ్ల ట్యాంకులో పడి 30కోతులు మరణించాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..విజయ విహార్ సమీపంలోని 200ఇళ్లకు మంచినీరు సరఫరా చేసేందుకు ఓ ట్యాంకు నిర్మించారు. దానిపైన రేకులు వేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్యాంకులో నీళ్లు తాగేందుకు ప్రయత్నించాయి కోతులు. ఈ క్రమంలోనే ట్యాంకులోకి దిగిన కోతులు బయటకు వచ్చే దారి దొరక్క అందులోనే మరణించాయి. బుధవారం అధికారులు గుర్తించి దాదాపు 30 కోతుల కళేబరాలను వెలికితీశారు. వాటర్ ట్యాంకులో కోతులు మరణించిన విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కోతులు చనిపోయి దాదాపు 15రోజులు పై నే అయింటుందంటున్నారు. అప్పటి నుంచి ఆ నీటినే తాగుతున్నామని ఆందోళన చెందుతున్నారు. కోతులు మరణించిన నీరు తాగమని..తాము అనారోగ్యం బారిన పడతామని భయపడుతున్నారు. కాలనీలోని ఇళ్లకు నీటిని సరఫరా చేసే ట్యాంకులను ప్రతి 6 నెలలకు ఒకసారి శుభ్రం చేయాలని అధికారులు చెప్పినా ఏనాడూ శుభ్రం చేయలేదని ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన నీటి సరఫరా విభాగం అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: బావి తవ్వుతుండగా ప్రమాదం..మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు వ్యక్తులు..! #monkey #nagarjunasager #water-tank మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి