Viral Video: పతంగుల పండుగ సందడిలో ఉన్న వారంతా ఎంతో ఆనందంతో గాలిపటాలు ఎగురవేస్తుండగా, మూడేళ్ల చిన్నారి ఓ భారీ గాలిపటంతో సహా గాలిలో ఎగిరిన షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదృష్టవశాత్తూ, చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Viral Video: సోషల్ మీడియాలో రోజూ చాలా వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని వీడియోలు పాతవి కూడా మళ్ళీ మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఎన్నిసార్లు రీపోస్టు అయినా.. అన్నిసార్లు అవి ట్రెండ్ అవుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని వీడియోలు హృద్యంగా ఉంటే, కొన్ని సన్నివేశాలు మనల్ని నవ్విస్తాయి. ముఖ్యంగా, ఇది సాధ్యమేనా అని కొన్ని సన్నివేశాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. మరికొని అయితే మనలో భయాన్ని కూడా సృష్టిస్తాయి. ప్రస్తుతం ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. అందులో మూడేళ్ల చిన్నారి భారీ గాలిపటంతో గాలిలోకి ఎగిరిపోయింది. ఈ దృశ్యం నెటిజన్లను షాక్‌కు గురి చేసింది.
Viral Video: ఈ సంఘటన 2020లో తైవాన్‌లో జరిగింది. హ్సించు సిటీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌లో భారీ గాలిపటాన్ని ఎగురవేస్తున్నప్పుడు, గాలిపటం పట్టుకుని నిలబడి ఉన్న మూడేళ్ల చిన్నారి దానితో పాటు గాలిలోకి ఎగిరిపోయింది. కొన్ని సెకన్ల తర్వాత చిన్నారి సురక్షితంగా కింద పడిపోయింది. ఈ వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.
@nagiuscorporation అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో దీని గురించి ఒక పోస్ట్ షేర్ చేశారు. అది ప్రస్తుతం వైరల్ అయిపొయింది. ఈ వైరల్ వీడియోలో, కైట్ ఫెస్టివల్‌లో గుమిగూడిన ప్రజలు భారీ గాలిపటాన్ని ఎగురవేయడానికి సిద్ధమవుతున్నట్లు చూడవచ్చు. అలా ఆ గాలిపటాన్ని ఎగురవేస్తుండగా ఆ గాలిపటాన్ని చేత్తో పట్టుకున్న మూడేళ్ల చిన్నారి కూడా గాలిపటంతోపాటు ఎగిరింది. ఆకాశంలో ఎగిరిపోతున్న చిన్నారిని చూసి అక్కడ గుమికూడిన వారంతా ఒక్కసారిగా చలించిపోయారు. తరువాత గాలిపటం కిందకు దిగడంతో ఆ చిన్నారిని వారు రక్షించారు.
ఐదు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకి 22.9 మిలియన్ వ్యూస్, 1.2 మిలియన్ లైక్స్ రావడంతో ఈ షాకింగ్ సీన్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.