/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/3-days-3-movies-for-Christmas-jpg.webp)
సంక్రాంతి పోటీ గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా ఉండేదే. ఈమధ్య దసరా పోటీ కూడా చూస్తున్నాం. కానీ క్రిస్మస్ బాక్సాఫీస్ వార్ మాత్రం అరుదు. ఇన్నాళ్లూ ఈ సీజన్ ను టాలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం క్రిస్మస్ సీజన్ ను కూడా వదలడం లేదు.
ఇంకా చాలా టైమ్ ఉంది. అంతలోనే 3 సినిమాలు క్రిస్మస్ కు షెడ్యూల్ అయ్యాయి. ఏదో ప్రకటించి ఊరుకోవడం కాదు. ఏకంగా తేదీలు కూడా ప్రకటించి పోస్టర్లు వేసేంత వరకు వెళ్లారు. క్రిస్మస్ సీజన్ లో వరుసగా 3 రోజుల్లో 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇంతకీ ఆ 3 సినిమాలేంటో తెలుసా?
నాని హీరోగా నటిస్తున్న సినిమా హాయ్ నాన్న. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మృణాల్ ఠాకూల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను క్రిస్మస్ బరిలో డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నారు.
హాయ్ నాన్న రిలీజైన మరుసటి రోజు, అంటే డిసెంబర్ 22న సైంధవ్ సినిమా రిలీజ్ అవుతోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ఇక ఆ తర్వాత, అంటే డిసెంబర్ 23న నితిన్ హీరోగా నటిస్తున్న ఎక్స్ ట్రా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. వక్కంతం వంశీ దర్శకుడు.
ఇలా క్రిస్మస్ బరిలో 3 రోజుల్లో 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి సినిమాకు గ్యాప్ 24 గంటలు మాత్రమే. సంక్రాంతి సీజన్ లో మాత్రమే కనిపించేంత పోటీ, ఈసారి క్రిస్మస్ కు కనిపిస్తోందన్నమాట.