Odisha Train Accident: ఒడిశా రైలు దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఒడిశాలోని బహనాగా మార్కెట్ సమీపంలో జూన్ 2న మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 295 మంది మృతి చెందారు. దాదాపు వంద మంది గాయపడ్డారు. దేశ చరిత్రలోనే అత్యంత భయంకరమైన, ఘోరమైన రైలు ప్రమాదంగా ఈ ఘటన నిలిచిపోయింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇంకా 29 మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. అనాథశవాలుగు గుర్తించి ఐదు కంటైనర్లలో ఎయిమ్స్ భువనేశ్వర్‌లో భద్రపరిచారు. 266 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించామని ఎయిమ్స్ అధికారులు తెలిపారు.
జూన్ 2న జరిగిన ప్రమాదం తర్వాత తీవ్రగాయాలై ఆసుపత్రిలో చేరి మరణించినవారు... ఘటనాస్థలంలోనే మరణించిన మొత్తం 162 మంది మృతదేహాలను బంధువులు గుర్తించారు. వాటిలో 81 మృతదేహాలను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIMS)కు అప్పగించినట్లు సూపరింటెండెంట్ భువనేశ్వర్ దిలీప్ కుమార్ పరిదా తెలిపారు. మొదటి దశలో కుటుంబాలు.. సభ్యులకు తమవారిని గుర్తించి తీసుకెళ్లారు. ఇతర సమస్యల వల్ల మిగిలిన 81 మృతదేహాల గుర్తింపును ప్రాథమికంగా చేయలేమని పరిదా చెప్పారు.
డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా 52 మృతదేహాల గుర్తింపు:
డీఎన్‌ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా మరో 52 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని, ఇంకా 29 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని తెలిపారు. క్లెయిమ్‌దారులతో డీఎన్‌ఏ సరిపోలని మృతదేహాలను నిబంధనల ప్రకారం ఎవరికీ ఇవ్వబోమని చెప్పారు.
Odisha Train Accident Effect: ముగ్గురు రైల్వే సిబ్బందిని అరెస్టు చేసిన సిబిఐ:
బాలాసోర్‌లో జరిగిన ఈ రైలు ప్రమాదంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ముగ్గురు రైల్వే సిబ్బంది సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌లను సీబీఐ అరెస్ట్ చేసింది. వారందరినీ బాలాసోర్‌లో నియమించారు. ప్రమాదం జరిగిన తర్వాత ముగ్గురూ సాక్ష్యాలను దాచిపెట్టారని ఆరోపించారు. ముగ్గురిని ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్లు 304 (అపరాధపూరితమైన నరహత్య హత్య కాదు) 201 (సాక్ష్యాలు లభించకుండా చేయడం) కింద అరెస్టు చేశారు. అనంతరం నిందితులను కట్టుదిట్టమైన భద్రత మధ్య భువనేశ్వర్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు
Also Read: మీ వాట్సాప్ పర్సనల్ చాట్స్‌ని ప్రభుత్వం చదువుతోందా? యూజర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇదే!