Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా ఓ కామాంధ కీచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని అరెస్ట్ చేసి విహెచ్చరించగా పోలీసులకు కళ్ళుతిరిగే సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంటకు చెందిన బోయ కాసమయ్య అలియాస్ ఖాసీం(25) కూలి పనిచేసేవాడు. మద్యానికి బానిసై, జల్సాలకు అలవాటుపడిన అతడు రెండున్నర ఏళ్ల క్రితం మహబూబ్‌నగర్‌కు మకాం మార్చాడు. కూలి పనులు చేస్తూ.. వచ్చిన డబ్బును మద్యానికి, తిండికి ఖర్చు పెట్టేవాడు. బస్టాండ్లలో, ఫుట్పాత్లపై పడు కునేవాడు. కూలీలు, అమాయకులైన మహిళలకు మాయమాటలు చెప్పి, డబ్బులు ఇస్తానని నమ్మించి.. దూర ప్రాంతాలకు తీసుకెళ్లిశారీరకంగా అనుభ వించేవాడు.
తర్వాత డబ్బులు ఇవ్వకుండా చంపేవాడు. ఇలా ఆరుగురు మహిళలను వివిధ ప్రాంతాల్లో హత్య చేశాడు. మే 23న మహబూబ్‌నగర్ పట్టణం టీడీగుట్టలోని కూలీల అడ్డా నుంచి ఓ మహిళను కాసమయ్య తన వెంటబెట్టుకొని భూత్పూర్ పురపాలిక అమిస్తాపూర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెతో శారీరకంగా కలిశాడు. ఆమె డబ్బులు అడగగా.. తనవద్ద ఉన్న టవల్ను ఆమె మెడకు చుట్టి.. బ్లేడుతో గొంతు కోశాడు. రాయితో ముఖంపై మోదీ చంపేశాడు. ఆమె కాళ్లకు ఉన్న పట్టీలను దొంగిలించాడు. మే 24న మృతదేహాన్ని గుర్తించిన భూత్పూర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం మహబూబ్‌నగర్ షాసాబ్ గుట్ట వద్ద కాసమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 2022 నుంచి ఆరుగురు మహిళలను హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. కాసమయ్యపై కేసులు నమోదుచేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు