చైనాలో భారీ భూకంపం... 120కి పైగా భవనాలు నేలమట్టం...!

చైనాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు చైనాలోని షాన్ డాంగ్ ప్రావిన్సులోని పింగ్ యువాన్ కౌంటీలో ఆదివారం ఉదయం 2.33 గంటలకు భూమి కంపించిది. కౌంటీలో సుమారు 120కి పైగా భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు.

New Update
చైనాలో భారీ భూకంపం... 120కి పైగా భవనాలు నేలమట్టం...!

చైనాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు చైనాలోని షాన్ డాంగ్ ప్రావిన్సులోని పింగ్ యువాన్ కౌంటీలో ఆదివారం ఉదయం 2.33 గంటలకు భూమి కంపించిది. కౌంటీలో సుమారు 120కి పైగా భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. భూమిలోపల 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్టు అధికారులు తెలిపారు.

ఒక్క సారిగా భూమి కంపించడంతో డిజావులోని ప్రజలు ఒక్క సారిగా భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపానికి భవనాల గోడల్లోని నుంచి ఇటుకలు కిందికి పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైల్వే ట్రాక్ లు డ్యామేజ్ అయినట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రావిన్సులోని అన్ని రైల్వే ట్రాకులను తనిఖీ చేస్తున్నట్టు చైనాకు చెందిన చైనా సెంట్రల్ టెలివిజన్ వెల్లడించింది.

భూకంపం నేపథ్యంలో 60కి పైగా రైళ్లను రద్దు చేసినట్టు బీజింగ్ రైల్వే అధికారులు ప్రకటించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కోసం సహాయక బృందాలను పంపినట్టు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతన్నాయన్నారు. క్షతగాత్రులను సమీపంలోన ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్టు చెప్పారు.

ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టం గురించి అంచనా వేస్తున్నామన్నారు. భూకంపం వల్ల అటు రహదారులపై కూడా ప్రభావం పడింది. చాలా చోట్లు రహదారులు కూడా డ్యామేజీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పైప్‌లైన్లు దెబ్బతినడంతో గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగింది. ఈ క్రమంలో చైనా ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ మినిస్ట్రీ ‘లెవెల్-ఫోర్’ఎమర్జెన్సీని ప్రకటించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు