Godavari Districts: అల్లుడికి 225 రకాల వంటకాలు.. గోదారోళ్లంటే ఆ మాత్రం ఉండాల్సిందే..!

అతిధి మర్యాదలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. ఏలూరు జిల్లా రాజవరం గ్రామానికి చెందిన కాకి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులు అల్లుడు లోకేష్ సాయికి అపురూపమైన రీతిలో మర్యాదలు చేసారు. 225 రకాల వంటకాల చేసి కమ్మని కనువిందు ఏర్పాటు చేశారు.

New Update
Godavari Districts: అల్లుడికి 225 రకాల వంటకాలు.. గోదారోళ్లంటే ఆ మాత్రం ఉండాల్సిందే..!

Godavari Districts: అతిధి మర్యాదలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. అటువంటి గోదావరి జిల్లాల ఘనమైన మర్యాదను విజయవాడ కు చెందిన లోకేష్ సాయి అనే వ్యక్తి తన అత్తవారింటికి వచ్చి దక్కించుకున్నాడు. వివరాలలోకి వెళ్తే ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చెందిన కాకి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతుల కుమార్తె జ్యోత్స్న ను పది నెలల క్రితం విజయవాడ కు చెందిన లోకేష్ సాయి అనే వ్యక్తి కి ఇచ్చి వివాహం చేసారు.

Also Read: జల్లికట్టు పోటీలు ప్రారంభం.. పెద్దఎత్తున తరలివస్తున్న జనాలు..

లోకేష్ సాయి బెంగుళూరు లోబిజినెస్ చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా అత్త, మామ ల ఆహ్వానం మేరకు లోకేష్ సాయి తన భార్య ను తీసుకుని రాజవరం వచ్చారు. అత్తవారింటికి వచ్చిన అల్లుడికి కాకి నాగేశ్వరరావు దంపతులు ఘనమైన స్వాగతం పలికి అపురూపమైన రీతిలో మర్యాదలు చేసారు. భోగి పండగ రోజు భోజనం ను అల్లుడు జీవితంలో మర్చిపోలేని విధంగా 225 రకాల వంటకాలతో వడ్డించి ఘనంగా మర్యాదలు చేసారు.

Also Read: వామ్మో..కిలో చికెన్ 600.. ఉల్లి 250 రూపాయలు.. ఎక్కడంటే.. 

225 రకాల వంటకాలను చూసి అల్లుడు లోకేష్ సాయి ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. తమ కుమారుడికి అత్త, మామలు వడ్డించిన విందు భోజనం చూసి లోకేష్ సాయి తల్లి దీప్తి మాట్లాడుతూ ఇది గోదావరి జిల్లాల ప్రేమ, సాంప్రదాయం, గౌరవ మర్యాదలకు నిదర్శనం అని అంటూ సంతోషం వ్యక్తం చేసారు.

Advertisment
తాజా కథనాలు