ISL : ఐఎస్‌ఎల్‌ ఛాంపియన్ గా ముంబై.. రెండో టైటిల్‌ కైవసం!

2024 ఐఎస్‌ఎల్‌ ఛాంపియన్ గా ముంబై సిటీ ఎఫ్‌సీ అవతరించింది. మోహన్‌ బగాన్‌ తో శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో విజయం సాధించింది. దీంతో ముంబై రెండోసారి టైటిల్ కైవసం చేసుకుంది.

ISL : ఐఎస్‌ఎల్‌ ఛాంపియన్ గా ముంబై.. రెండో టైటిల్‌ కైవసం!
New Update

Mumbai : 2024 ఐఎస్‌ఎల్‌ ఛాంపియన్(ISL Champion) గా ముంబై సిటీ ఎఫ్‌సీ(Mumbai City FC) అవతరించింది. మోహన్‌ బగాన్‌(Mohun Bagan) తో శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో విజయం సాధించింది. దీంతో ముంబై రెండోసారి ఫుట్ బాల్ టైటిల్ కైవసం చేసుకుంది.

Also Read : మార్పులు లేని బంగారం.. వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే..

ఈ మేరకు మొదటినుంచి ఇరువురి మధ్య పోరు హోరాహోరిగా సాగగా.. 44వ నిమిషంలో జేసన్‌ కమింగ్స్‌ గోల్‌తో మొదట మోహన్‌ బగాన్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్‌ (53వ) గోల్‌తో ముంబయి స్కోరు సమం చేసింది. అయితే 81వ నిమిషంలో బిపిన్‌ సింగ్‌ గోల్‌తో ముంబై 2-1 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇక ఆఖర్లో సబ్‌స్టిట్యూట్‌ జాకుబ్‌ వోటస్‌ (90+7) గోల్‌ కొట్టడంతో ముంబై 3-1తో ముగించింది.

publive-image

#isl #mumbai-city-fc #mohun-bagan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe