/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-73-jpg.webp)
Mumbai : 2024 ఐఎస్‌ఎల్ ఛాంపియన్(ISL Champion) గా ముంబై సిటీ ఎఫ్‌సీ(Mumbai City FC) అవతరించింది. మోహన్ బగాన్(Mohun Bagan) తో శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో విజయం సాధించింది. దీంతో ముంబై రెండోసారి ఫుట్ బాల్ టైటిల్ కైవసం చేసుకుంది.
𝑾𝑬 𝑨𝑹𝑬 𝑻𝑯𝑬 𝑪𝑯𝑨𝑴𝑷𝑰𝑶𝑵𝑺 🏆🎶
मंडळी, #TheIslanders are your #𝐈𝐒𝐋𝟏𝟎 𝐂𝐮𝐩 𝐖𝐢𝐧𝐧𝐞𝐫𝐬 🩵🔥#MBSGMCFC #AamchiCity 🔵 pic.twitter.com/SlMkiF7uZW
— Mumbai City FC (@MumbaiCityFC) May 4, 2024
Also Read : మార్పులు లేని బంగారం.. వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే..
ఈ మేరకు మొదటినుంచి ఇరువురి మధ్య పోరు హోరాహోరిగా సాగగా.. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్‌తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్‌తో ముంబయి స్కోరు సమం చేసింది. అయితే 81వ నిమిషంలో బిపిన్ సింగ్ గోల్‌తో ముంబై 2-1 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇక ఆఖర్లో సబ్‌స్టిట్యూట్ జాకుబ్ వోటస్ (90+7) గోల్ కొట్టడంతో ముంబై 3-1తో ముగించింది.