2008 నుంచి 2024 వరకూ ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన టీమ్స్ ఇవే ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకూ 17 సీజన్స్ అయ్యాయి. ఈ సీజన్ లో కోల్ కత ట్రోఫీ అందుకుంది. ఇప్పటివరకూ ఐపీఎల్ సీజన్స్ లో ఎవరెవరు ట్రోఫీలు గెలిచారు.. ఈ ఫోటో స్టోరీలో చూసేయండి. By KVD Varma 27 May 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలుచుకుంది. IPL ఇంతకు ముందు 16 ఎడిషన్లలో ఏ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది అనే పూర్తి లిస్ట్ ఇక్కడ ఉంది... IPL 2023 Winners IPL 2023- చెన్నై సూపర్ కింగ్స్: గత సీజన్లో, IPLలో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ 5వ సారి టైటిల్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో వర్షం రావడంతో డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని ఛేదించిన సీఎస్కే జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. IPL 2022 Winners IPL 2022- గుజరాత్ టైటాన్స్: ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ తొలిసారి టైటిల్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 130 పరుగులు మాత్రమే చేసింది. ఈ సులభమైన లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ టైటాన్స్ జట్టు 18.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఐపీఎల్ ద్వారా హార్దిక్ పాండ్య పడే ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. IPL 2021 Winners IPL 2021-చెన్నై సూపర్ కింగ్స్: IPL 2021లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఈ భారీ స్కోరును ఛేదించడానికి బరిలో దిగిన కేకేఆర్ 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సీఎస్కే 27 పరుగుల తేడాతో గెలిచి చాంపియన్‌గా నిలిచింది. IPL 2020 Winners IPL 2020-ముంబయి ఇండియన్స్: ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదోసారి చాంపియన్‌గా నిలిచింది. IPL 2019 Winners IPL 2019-ముంబై ఇండియన్స్: ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్లో పటిష్టమైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఫైనల్ చివరి బంతికి 1 పరుగు తేడాతో గెలిచి ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలిచింది. IPL 2018 Winners IPL 2018-చెన్నై సూపర్ కింగ్స్: IPL లో రెండు కంటే ఎక్కువ ట్రోఫీలు గెలుచుకున్న రెండవ జట్టు చెన్నై సూపర్ కింగ్స్. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించడం ద్వారా CSK ఛాంపియన్‌గా నిలిచింది. IPL 2017 Winners IPL 2017-ముంబయి ఇండియన్స్: IPL 2017 ఫైనల్లో, ముంబై ఇండియన్స్ కేవలం ఒక పరుగు తేడాతో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. IPL 2016 Winners IPL 2016-సన్‌రైజర్స్ హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 పరుగుల తేడాతో గెలిచి తొలిసారిగా ఛాంపియన్‌గా అవతరించింది. IPL 2015 Winners IPL 2015-ముంబై ఇండియన్స్: 2015 ఫైనల్లో, ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌పై 41 పరుగుల భారీ విజయంతో ఛాంపియన్‌గా నిలిచింది. IPL 2014 Winners IPL 2014-కోల్‌కతా నైట్ రైడర్స్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్‌గా ఛేదించింది. IPL 2013 Winners IPL 2013-ముంబై ఇండియన్స్: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ 23 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి టైటిల్‌ను గెలుచుకుంది. IPL 2012 Winners IPL 2012-కోల్‌కతా నైట్ రైడర్స్: చెన్నై సూపర్ కింగ్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్లో తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. IPL 2011 Winners IPL 2011-చెన్నై సూపర్ కింగ్స్: చెన్నై సూపర్ కింగ్స్ IPL చరిత్రలో బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ గెలిచిన మొదటి జట్టుగా నిలిచింది. ఆర్సీబీతో జరిగిన ఫైనల్లో 58 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. IPL 2010 Winners IPL 2010-చెన్నై సూపర్ కింగ్స్: 2010 ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 22 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి తొలిసారి టైటిల్‌ను గెలుచుకుంది. IPL 2009 Winners IPL 2009-డక్కన్ ఛార్జర్స్: IPL 2వ సీజన్ చివరి మ్యాచ్‌లో, డెక్కన్ ఛార్జర్స్ (ప్రస్తుతం SRH) జట్టు RCB జట్టును 6 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. IPL 2008 Winners IPL 2008-రాజస్థాన్ రాయల్స్: IPL మొదటి సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ - రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 163 పరుగులు చేసింది. ఈ పోటీ సవాలును ఛేదించిన రాజస్థాన్ రాయల్స్ చివరి బంతికి విజయం సాధించి ఉత్కంఠ విజయంతో తొలి ఛాంపియన్‌గా అవతరించింది. Also Read: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్ మూటగట్టుకున్న ఎస్ఆర్హెచ్! #ipl-winners #ipl మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి