Maruti Suzuki : మైలేజ్ ఇవ్వట్లేదని 20 ఏళ్ల తరువాత మారుతి సుజుకీకి ఫైన్! మారుతీ సుజుకీ కార్ల ప్రకటనలో లీటరుకు 16-18 కిలోమీటర్లు వస్తుందని చూసి కొన్న వ్యక్తి మోసపోయానంటూ 2004 లో వినియోగదారుల ఫోరంలో దీని గురించి ఫిర్యాదు చేయగా 20 సంవత్సరాల తరువాత మారుతీ సుజుకీకి ఎన్సీడీఆర్సీ లక్ష రూపాయల జరిమానా విధించింది. By Bhavana 27 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి NCRC : భారతదేశం(India) లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి(Maruti Suzuki) గురించి తెలియని వారు ఎవరు ఉండరు. అయితే ఈ కారు మైలేజ్ గురించి కస్టమర్ కి తప్పు సమాచారం ఇచ్చినందుకు గానూ 20 సంవత్సరాల తరువాత కస్టమర్ కు రూ. లక్ష రూపాయలు చెల్లించాలని నేషనల్ కన్స్యూమర్ రిడ్రెసల్ కమిషన్(NCRC) ఆదేశాలు జారీ చేసింది. సదరు కంపెనీ పై ఓ వ్యక్తి 2004లో వినియోగదారుల ఫోరమ్ లో ఫిర్యాదు చేయగా దీనికి సంబంధించిన తీర్పు గత వారం వెల్లడైంది. గతవారం ఓ తీర్పులో డాక్టర్ ఇందర్ జిత్ సింగ్ నేతృత్వంలోని ఎన్సీడీఆర్సీ బెంచ్(NCDRC Bench) '' సాధారణంగా కారును కొనుగోలు చేసే వ్యక్తి కారు ఇంధనానికి సంబంధించిన అన్ని ఫీచర్లను క్షుణంగా పరిశీలించి తీసుకుంటారు. ఇక్కడ ఫిర్యాదు చేసిన సదరు వ్యక్తి కూడా 2004 అక్టోబర్ లో మారుతీ సుజుకీ కి సంబంధించిన ప్రకటన చూసి కారును కొనుగోలు చేయడం జరిగింది. ఆ ప్రకటనలో కారు లీటరుకు 16 నుంచి 18 కిలోమీటర్లు ఇంధనాన్ని ఇస్తుందని ప్రకటన లో కంపెనీ తెలిపింది. దీనిని చూసిన రాజీవ్ శర్మ(Rajiv Sharma) అనే వ్యక్తి కారును కొనుగోలు చేశారు. అయితే కారు మాత్రం 16 కిలో మీటర్ల మైలేజ్(Mileage) ఇవ్వడం లేదు. లీటరుకు సగటున 10. 2కిలో మీటర్లు మాత్రమే కారు మైలేజ్ ఇవ్వడంతో మోసపోయానని గ్రహించిన రాజీవ్ శర్మ మారుతి సుజుకీ కార్ల సంస్థ పై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. Also Read : ‘సిద్ధం’లో మోగనున్న జగన్ ఎన్నికల శంఖారావం.. లక్షల్లో జనసమీకరణ! వడ్డీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు, బీమాతో సహా మొత్తం రూ. 4 లక్షల తో కారును కొన్న మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని రాజీవ్ ఫిర్యాదులో కోరాడు. జిల్లా ఫోరం అతని ఫిర్యాదును స్వీకరించి అతని అభ్యర్థనను ఆమోదించి అతనికి రూ. లక్ష పరిహారం అందించింది. ఈ నిర్ణయం పై మారుతీ సుజుకీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కంపెనీ స్టేట్ కమిషన్ ను ఆశ్రయించింది. జిల్లా ఫోరం ఆదేశాలను రాష్ట్ర కమిషన్ సమర్థించింది. దీంతో ఈ కేసు ఎన్సీడీఆర్సీకి చేరుకుంది. శర్మ తరుఫున న్యాయవాదులు, మారుతీ సుజుకీ తరుఫున న్యాయవాదులు ఇరువురు కూడా కోర్టులో వాదించారు. శర్మ కారును డీడీ మోటార్స్ డీలర్ షిప్ నుంచి కొనుగోలు చేశాడు. అయితే సదరు డీలర్లు సమన్లు అందుకున్నప్పటికీ కూడా వారు కోర్టుకు రాలేదు. దీంతో వారి పై ఎక్స్‌పార్ట్ కేసు కూడా కొనసాగింది. ఇరు వర్గాలు కూడా ఎన్‌సిడిఆర్‌సికి రాతపూర్వక వాదనలు సమర్పించాయి. శర్మ తన వాదనను ఆగస్టు 7, 2023న సమర్పించగా, మారుతీ సుజుకీ నవంబర్ 2, 2023న ప్రతిస్పందించారు. NCDRC చివరికి ముందు ఇచ్చిన తీర్పులను సమర్థించింది. మారుతీ సుజుకీ(Maruti Suzuki) ఇచ్చిన ప్రకటనలను తప్పుపట్టింది. దీంతో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ వినియోగదారునికి లక్ష రూపాయల పరిహారం అందించింది. Also read: “మనవరాళ్లతో పద్మ విభూషణుడు”.. రేర్ ఫోటో షేర్ చేసిన మెగా కోడలు! #maruti-suzuki #highest-mileage-cars #ncdrc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి