/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/delhi.jpg)
Bomb Threat In Delhi:దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ బెదిరింపు కాల్ కలకలం రేపింది. ఢిల్లీలోని రెండు ఆసుపత్రులకు బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. లోక్ సభ ఎన్నికల వేళ బాంబ్ బెదిరింపు మెయిల్ రావడంతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. బురారీలోని ప్రభుత్వ ఆసుపత్రి, మంగోల్‌పురిలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొంది. కాగా రెండు రోజుల క్రితం ఢిల్లీలోని స్కూల్స్ లకు బాంబ్ బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.
Delhi: Bomb threat email received at Burari Government Hospital and Sanjay Gandhi Hospital in Mangolpuri, search operation underway: Delhi Fire Service
— ANI (@ANI) May 12, 2024
100 స్కూళ్లకు బాంబ్ బెదిరింపు..
దేశరాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఈ నెల 8న ఉదయం ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలోని వందకు పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులను బయటకు పంపించాయి. సమాచారం మేరకు వెంటనే ఆయా స్కూళ్లకు పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు చేరుకున్నాయి. పాఠశాలల్లో క్షుణ్ణంగా తనిఖీలు జరపగా.. ఎలాంటి బాంబులు ఉన్నట్లు గుర్తించలేదు. ఢిల్లీలోని దాదాపు 100 పాఠశాలలు, నోయిడాలో రెండు పాఠశాలలకు ఈ బాంబు మెయిల్స్ వచ్చాయి. దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ బాంబు బెదిరింపు మెయిల్స్ బూటకమని తెలిపింది.