Mahatma Gandhi Assassination Day : మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ (మహాత్మా గాంధీ)(Mahatma Gandhi) అక్టోబర్ 2, 1869న గుజరాత్(Gujarat) లోని పోర్‌బందర్‌లో జన్మించారు. మహాత్మా గాంధీని భారతదేశ జాతిపిత అని పిలుస్తారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ ప్రత్యేక పాత్ర పోషించారు. గాంధీజీ తండ్రి పేరు కరంచంద్ గాంధీ, ఆయన రాజ్‌కోట్ దివాన్, ఆయన తల్లి పేరు పుత్లీబాయి. గాంధీజీ ఎప్పుడూ స్వేచ్ఛ కోసం సత్యం, అహింస మార్గాన్ని ఎంచుకుని ఎన్నో ఉద్యమాలు చేశారు. జనవరి 30న గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. అందుకే భారత్‌లో ప్రతి సంవత్సరం జనవరి 30న అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ క్రమంలో మహాత్మా గాంధీ హత్య గురించి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలున్నాయి.
➼ మహాత్మా గాంధీ(Mahatma Gandhi) 79 సంవత్సరాల వయస్సులో జనవరి 30, 1948న న్యూఢిల్లీ(New Delhi) లోని బిర్లా హౌస్‌లో (ప్రస్తుతం గాంధీ స్మృతి) హత్యకు గురయ్యారు.
➼ నివేదికల ప్రకారం ఆయన సాయంత్రం 5:12 గంటలకు కాల్చి చంపబడ్డారు.
➼ గాంధీ ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా హిందూ మహాసభకు చెందిన ప్రముఖ సభ్యుడు నాథూరామ్ గాడ్సే ఆయనను అడ్డుకున్నారు.
➼ గాడ్సే, 36 సంవత్సరాల వయస్సులో, బెరెట్టా M 1934 సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌తో పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో గాంధీ ఛాతీపై మూడుసార్లు కాల్చాడు.
➼ గాంధీజీని కాల్చి చంపిన తర్వాత తిరిగి బిర్లా హౌస్‌లోకి తీసుకువెళ్లారని చెబుతారు.
➼ గాంధీని హత్య చేసినందుకు గాడ్సే, సహచర కుట్రదారు నారాయణ్ ఆప్టేలకు మరణశిక్ష విధించారు. గాడ్సే సోదరుడు గోపాల్‌తో సహా మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించారు.
➼ గాంధీ చివరి పదాలు 'హే రామ్'(Hey Ram).. కాల్చిన తర్వాత ఆయన హే రామ్ అంటూ కుప్పకూలారు.
➼ గాంధీని చంపడానికి ఐదుసార్లు విఫలయత్నాలు జరిగినట్లు చెబుతారు.
➼ గాంధీని చంపడానికి మొదటి ప్రయత్నం 1934లో జరిగిన బాంబు దాడి. 1944లో గాడ్సే బాకుతో అతని వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించి రెండుసార్లు పట్టుబడ్డాడు.
➼ జనవరి 20, 1948న, గాడ్సే, అతని తోటి కుట్రదారులు ప్రణాళికాబద్ధంగా కాల్పులు జరపడంలో విఫలమయ్యారు.
➼ ఆయన హత్యకు రెండు రోజుల ముందు గాంధీ ఈ హత్యల గురించి ప్రకటన చేశారు.
Also Read: 49 ఏళ్ల మహిళను పెళ్లాడిన 103 ఏళ్ల తాత..అలా ఉండలేకపోతున్నా అంటూ!
WATCH: