High Alert: ఆ 25 ప్రాంతాల్లో బాంబులు.. హెచ్చరికల నేపథ్యంలో హైఅలర్ట్!

అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ULFA) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే తెలియజేయాలని అధికారులు కోరారు.

New Update
Bomb Threat Mail: బెంగళూరులో బాంబ్ బెదిరింపు మెయిల్ కలకలం

అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ULFA) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే తెలియజేయాలని అధికారులు కోరారు. ఇటీవల, అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులో ఉగ్రవాదులు మాటు వేసినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అస్సాం పోలీసులు అరుణాచల్ ప్రదేశ్‌తో సరిహద్దులో నిఘాను కట్టుదిట్టం చేశారు.

ఈ సందర్భంగా అస్సాం డీజీపీ మాట్లాడుతూ.. తమ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో పాటు స్థానిక ఏజెన్సీల నుంచి తమకు నివేదికలు వచ్చాయన్నారు. అస్సాం-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉల్ఫా (ఐ) గ్రూప్ క్యాంపింగ్ చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి విధ్వంసకర కార్యకలాపాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసులు, సైన్యం, సీఆర్‌పీఎఫ్‌తో సహా అన్ని భద్రతా సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ఉల్ఫా (ఐ) కార్యకర్తలు ఏమీ చేయరని తాము ఆశిస్తున్నామన్నారు. మరో వైపు నిఘాను తీవ్రతరం చేశామన్నారు. ఇంకా.. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ULFA).. ఇది ఈశాన్య భారత రాష్ట్రమైన అస్సాంలో యాక్టవ్ గా ఉన్న సాయుధ తీవ్రవాద సంస్థ.

Also Read : హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో మూడు రోజులు వానలే !

Advertisment
Advertisment
తాజా కథనాలు