బంగ్లాదేశ్ లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ( Bangladesh Bus Accident)అదుపు తప్పి చెరువులో పడిపోయింది. ఈ ఘనలో 17మంది మరణించగా...35మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం ఈ ప్రమాదం జరిగిందని అధికారులు నివేధికలో పేర్కొన్నారు. 60 మంది ప్రయాణికులతో బస్సు భండారియా నుంచి సౌత్ వెస్ట్ డివిజన్ ప్రధాన కార్యాలయమైన బరిసాల్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఉదయం పది గంటలకు జలకాతి జిల్లాలో బరిషల్ ఖుల్నా హైవే (Barishal Khulna Highway)పై ఛత్రకాండ వద్ద అదుపు తప్పి బస్సులో చెరువులో పడిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే మరణించారని, గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారని బరిషల్ డివిజనల్ కమిషనర్ MD షౌకత్ అలీ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది పిరోజ్‌పూర్‌లోని (Pirojpur) భండారియా సబ్‌జిల్లా, ఝల్‌కతిలోని రాజాపూర్ ప్రాంతానికి చెందినవారు ఉన్నట్లు తెలిపారు.
కాగా బస్సులో మొత్తం 65మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన 35ఏళ్ల రౌసెల్ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ...నేను డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న. బస్సు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ అప్రమత్తంగా లేరు. తన సహాయకుడితో మాట్లాడుతూ డ్రైవింగ్ చేశాడు. బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకున్నాడని తెలిపాడు. ఈ ప్రమాదం రౌసెల్ తన తండ్రిని కోల్పోయాడు. అతని సోదరుడి ఆచూకీ ఇంకా లభించలేదని చెప్పాడు.
ఇక బంగ్లాదేశ్ లో రోడ్డు ప్రమాదాలు సాధారణంగా మారాయి.రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ (RSF) ప్రకారం, జూన్‌లోనే మొత్తం 559 రోడ్డు ప్రమాదాలు జరిగాయి, ఈ ప్రమాదాల్లో 562 మంది మరణించగా...812 మంది గాయపడ్డారు. ఇది మొత్తం మరణాలలో 33.75 శాతంగా ఉందని బధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
దేశవ్యాప్తంగా 207 మోటార్‌సైకిల్ ప్రమాదాలలో 169 మంది మరణించారు, ఇది మొత్తం మరణాలలో 33.75 శాతం. అందులో 78 మంది మహిళలు, 114 మంది చిన్నారులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అదే సమయంలో 21 రైల్వే ప్రమాదాల్లో 18 మంది మరణించినట్లు నివేదికలో పేర్కొన్నారు. 11మంది గాయపడ్డారు. రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ పరిశీలన ప్రకారం.. అత్యధికంగా 247 (44.18 శాతం) ప్రాంతీయ రహదారులపై, 182 (32.55 శాతం) జాతీయ రహదారులపై, 59 (10.55 శాతం) గ్రామీణ రహదారులపై, మూడు (0.53 శాతం) పట్టణ రహదారులపై ఈ ప్రమాదాలు జరిగినట్లు పేర్కొంది.