బీహార్‎లో భానుడి ప్రతాపం...హీట్ వేవ్‎తో 16మంది బలి..!!

బీహార్ లో గత రెండు రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. వడగాల్పులు తీవ్రంగా వీస్తుండటంతో...16మంది మరణించారు. వేసవి తాపానికి తట్టుకోలేక వృద్ధులు, చిన్నారులు విలవిలాడుతున్నారు. అర్వాల్‌లలో నలుగురు, ఔరంగాబాద్‌లో ముగ్గురు, భోజ్‌పూర్‌లో ఇద్దరు, జెహనాబాద్, జముయి,భాగల్‌పూర్‌లలో ఒక్కొక్కరు సహా మొత్తం 16 మంది హీట్ స్ట్రోక్ కారణంగా మరణించారు. మరణించిన వారిలో ఇంజనీర్‌, మహిళా కానిస్టేబుల్‌ కూడా ఉన్నారు.

author-image
By Bhoomi
New Update
దంచికొడుతున్న ఎండలు, దేశమంతటా వడగాల్పుల హోరు..తెలుగు రాష్ట్రాల్లోనూ భానుడి భగభగ..!!

దక్షిణ భారతంలోనే కాదు...ఉత్తరభారతంలోనూ ఎండలు మండిపోతున్నాయి. బీహార్ లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకే సూర్యుడు భగభగమండిపోతున్నాడు. ఎండలకు వడగాల్పులు తోడవ్వడంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతోంది. ఉత్తరాది భాగం మినహా పాట్నాతో పాటు మిగిలిన జిల్లాల్లో గత కొన్ని రోజులుగా ఉక్కపోత, వేడిగాలుల బీభత్సం కొనసాగుతోంది. మరో మూడు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాజస్థాన్ నుండి వస్తున్న వేడి గాలి, తేమ లేకపోవడం, మేఘాలు లేకపోవడం మొదలైన వాటి కారణంగా రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాలలో వేడి గరిష్టంగా ఉందని పేర్కొంది.

heat wave

రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 40-43 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. వాతావరణ కేంద్రం పాట్నా ప్రకారం, రాబోయే 24 గంటల్లో, నైరుతి ప్రాంతాల్లోని బక్సర్, భబువా, రోహ్తాస్, ఔరంగాబాద్, భోజ్‌పూర్ అర్వాల్‌లో హీట్ వేవ్ కోసం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో, పాట్నా, నలంద, షేక్‌పురా, బంకా, బెగుసరాయ్, లఖిసరాయ్, ఖగారియా, జాముయి, జెహానాబాద్, గయా, భాగల్‌పూర్, ముంగేర్‌లలో వేడిగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈశాన్య, ఉత్తర మధ్య ప్రాంతాల్లోని జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు పేర్కొంది.

16 మంది బలి:
బంకా, అర్వాల్‌లో నలుగురు, ఔరంగాబాద్‌లో ముగ్గురు, భోజ్‌పూర్‌లో ఇద్దరు, జెహనాబాద్, జాముయి, భాగల్‌పూర్‌లలో ఒక్కొక్కరు సహా మొత్తం 16 మంది హీట్ స్ట్రోక్ కారణంగా మరణించారు. మరణించిన వారిలో ఇంజనీర్‌, మహిళా కానిస్టేబుల్‌ కూడా ఉన్నారు. బంకాలోని సదర్ ఆసుపత్రిలో, కేవలం రెండు గంటల్లో నలుగురు మరణించారు. జముయ్‌లోని చిన్న నీటిపారుదల శాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అజిత్‌కుమార్‌ ఆజాద్‌ హీట్ వేవ్ తో మృతి చెందారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు