Naidupeta Gurukula School: నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో ఆదివారం ఫుడ్ పాయిజన్ (Food Poison) కావడంతో సుమారు 150 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థత గురయ్యారు. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి చేసిన పూరీలను ఆదివారం ఉదయం విద్యార్థులకు పెట్టారు.
ఆ తరువాత ఆదివారం మధ్యాహ్నం చికెన్ పెట్టడంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు అధికారులు వివరించారు. గురుకుల పాఠశాలలో నాసిరకం నూనెలను వాడుతున్నందువల్ల తరచూ ఫుడ్ పాయిజన్ అవుతున్నట్లు తెలిసింది. అస్వస్థతకు గురైన విద్యార్థులను నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రులలో చికిత్సలు అందిస్తున్నారు.
సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీహరి నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల తల్లిదండ్రులతో చర్చించి పిల్లలకి ఎలాంటి అపాయం జరగదని భరోసా ఇచ్చారు.
Also Read:ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు!