AP : అనంతపురంలో 144 సెక్షన్.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : ఎస్పీ

కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు అనంతపురం ఎస్పీ గౌతమిసాలి. ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

New Update
AP : అనంతపురంలో 144 సెక్షన్.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : ఎస్పీ

Anantapur :  కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా అంతట హై అలెర్ట్ (High Alert) ప్రకటించామని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిసాలి (SP Gowthami Sali) తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. కౌంటింగ్ (Counting) జరిగే జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపల్ పట్టణాలు, మండల కేంద్రాల్లోని సమస్యాత్మక కాలనీలు, గ్రామాలలో ప్రత్యేక నిఘా వేశామన్నారు.

Also Read: ఎగ్జిట్ పోల్స్ లీక్స్.. రివర్స్ అవుతున్న బెట్టింగ్స్..

రౌడీషీటర్లు (Rowdy Sheeters), కిరాయి హంతకులు, ట్రబుల్ మాంగర్స్, హిస్టరీషీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సాధారణ ఎన్నికల (General Elections) కౌంటింగు దృష్ట్యా జిల్లా అంతటా 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఈ ఉత్తర్వులు ప్రకారం నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడరాదన్నారు. అమలులో ఉన్న 30 పోలీసు యాక్టు ప్రకారం పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు నిర్వహించరాదని.. విజయోత్సవ ర్యాలీలు చేపట్టరాదన్నారు.

Also Read: సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాల లైవ్.!

జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం బాణసంచా నిల్వ ఉంచడం, క్రయ విక్రయాలు చేయడం, కాల్చడం నిషేధమన్నారు. గెలుపోటములు సహజమని.. ఓడిన వారి పట్ల కవ్వింపు చర్యలకు పాల్పడటం, హేళన చేయడం, రెచ్చగొట్టడం చేయరాదన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు అనుమతించబడిన వ్యక్తులు మాత్రమే వెళ్లాలన్నారు. కౌంటింగ్ కేంద్రమైన జెఎన్టీయు పరిసరాలలోని హోటళ్లు, దుకాణాలు మూసివేయాలని.. కౌంటింగ్ తర్వాత కూడా అన్ని వర్గాల ప్రజలు సంయమనం కోల్పోకుండా శాంతియుతంగా మెలగాలని విజ్ఞప్తి చేశారు.

Advertisment
తాజా కథనాలు