Alert: షాకింగ్ న్యూస్.. ధూమపానం వల్ల ఏటా ఎన్ని లక్షల మంది చనిపోతున్నారో తెలుసా?

పొగాకు వల్ల ఏటా 13 లక్షల మంది చనిపోతున్నట్లు కొన్ని నివేదికలకు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాల్లో అధికంగా ఈ మరణాలు ఉండగా..వాటిలో భారత్‌ కూడా ఒకటి!

Alert: షాకింగ్ న్యూస్.. ధూమపానం వల్ల ఏటా ఎన్ని లక్షల మంది చనిపోతున్నారో తెలుసా?
New Update

పొగతాగడం వల్ల క్యాన్సర్‌ బారిన పడి భారత్‌ తో పాటు మరో ఏడు దేశాల్లో ప్రతి సంవత్సరం సుమారు 13 లక్షల మంది చనిపోతున్నట్లు తాజా అధ్యయనంలో తెలిసింది. క్యాన్సర్‌ బారిన పడిన వారిలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ తో పాటు చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, సౌత్‌ ఆఫ్రికా దేశాల్లో అధికంగా చనిపోతున్నారు.

ఈ అధ్యయనాన్ని క్లినికల్‌ మెడిసిన్‌ జర్నల్‌ లో ప్రచురించారు. ధూమపానం, మద్యపానం,ఊబకాయంతో పాటు హెచ్‌ఐవీ ఇన్‌ ఫెక్షన్లు వంటి ముప్పు అంశాల వల్ల ఏటా 20 లక్షల మందికి పైగా చనిపోతున్నట్లు వివరించింది.

కేవలం ధూమపానం వల్లే 2.08 కోట్ల సంవత్సరాల జీవన కాలాన్ని ప్రజలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ తో ప్రతి రెండు నిమిషాలకు ఒకరు చొప్పున చనిపోతున్నారని అధికారులు వివరించారు.

భారత్‌ లో పురుషుల్లో తల , మెడ క్యాన్సర్‌ తో ఎక్కువ మంది చనిపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థల్లో సంభవించే క్యాన్సర్లతో అధిక శాతం మంది ప్రాణాలు విడుస్తున్నట్లు తెలుస్తుంది.

అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలతో పోలిస్తే భారత్‌, దక్షిణాఫ్రికా లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ తక్కువగా జరుగుతోంది.

Also read: పెను విషాదం.. తండ్రి అస్థికలు కలిపేందుకు వచ్చి..!

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe