AP: పూరిగుడిసెలో 12 అడుగుల భారీ గిరినాగు.. తాటాకుల మధ్య తిష్ట వేసి..!

అనకాపల్లి జిల్లా రైవాడలో 12 అడుగుల భారీ గిరినాగు హల్ చల్ చేసింది. ఓ పూరిగుడిసెలో దాటాకులు మధ్య తిష్ట వేసి బుసలు కొట్టడంతో గుడిసెలో నివాసం ఉంటున్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. సుమారు గంట పాటు శ్రమించి.. ఓ గోనె సంచిలో బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

New Update
AP: పూరిగుడిసెలో 12 అడుగుల భారీ గిరినాగు.. తాటాకుల మధ్య తిష్ట వేసి..!

Anakapalle: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడలో భారీ గిరినాగు హల్ చల్ చేసింది. ఎస్సీ కాలనీలోని ఓ పూరిగుడిసెలో గిరినాగు ప్రత్యేక్షమైంది. అత్యంత ప్రమాదకరమైన గిరినాగు గుడిసెలోని తాటాకుల మధ్య తిష్ట వేసింది. బుసలు కొడుతున్న చప్పుడు రావడంతో గుడిసెలో నివాసం ఉంటున్న వారు దానిని చూసి భయంతో బయటకు పరుగులు తీశారు.

Also Read: కొండచిలువపై దూసుకెళ్లిన వాహనం.. చివరికి ఏం అయిందంటే?

స్థానిక నివాస ప్రజలు సైతం భయంతో వణికిపోయారు. వెంటనే గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారి ద్వారా విశాఖలోని స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. సుమారు గంట పాటు శ్రమించి.. 12 అడుగుల భారీ గిరినాగును సజీవంగా పట్టుకున్నారు. ఓ గోనె సంచిలో బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు