ఒడిశాలో ఘోరరోడ్డు ప్రమాదం..రెండు బస్సులు ఢీకొని 12 మంది మృతి..!!

ఒడిశాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. గంజాంలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 12మంది మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మైనర్లు, నలుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు.

New Update
ఒడిశాలో ఘోరరోడ్డు ప్రమాదం..రెండు బస్సులు ఢీకొని 12 మంది మృతి..!!

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. గత రాత్రి గంజాం జిల్లాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారికి బెర్హంపూర్‌లోని MKCG మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు.

odisha bus accident

బెర్హంపూర్‌లో స్థానిక మినీ బస్సు, OSRTC బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఒడిశాలోని గంజాం జిల్లా దిగండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖండేదేయులి గ్రామానికి చెందిన కుటుంబం తన కూతురును బెర్హంపూర్ లోని అత్తగారింటిలో దించేందుకు మినీ బస్సులో బయలుదేరారు. పెళ్లి వేడుక ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఎదురుగా వస్తున్న ఓఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీకొంది. దీంతో మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమయ్యింది. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. OSRTC బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున 1 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మైనర్లు, నలుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు