మెక్సికోలో హీట్‎వేవ్ విధ్వంసం..112 మంది మృతి

మెక్సికోలో వేడిగాలులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. జూన్ 11 , జూన్ 17 మధ్య దేశంలో వేడిగాలుల వల్ల 31 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఉత్తర సరిహద్దు రాష్ట్రమైన న్యూవో లియోన్ హీట్‌స్ట్రోక్, డీహైడ్రేషన్ కారణంగా అత్యధిక మరణాలు సంభవించాయి. వేడిగాలుల కారణంగా ఈ ఏడాది మొత్తం 112 మంది మరణించారు. గతేడాది 2022 కంటే మూడు రెట్లు ఎక్కువగా నమోదు అయ్యింది.

New Update
మెక్సికోలో హీట్‎వేవ్ విధ్వంసం..112 మంది మృతి

గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచ సమస్యగా మారింది. మెక్సికో పై కూడా దాని ప్రభావం పడింది. మెక్సికోలో వేడి బీభత్సం సృష్టించింది. ఎండ తీవ్రతకు ఈ ఏడాది ఇప్పటి వరకు 112 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య గతేడాది అంటే 2022 కంటే మూడు రెట్లు ఎక్కువని మెక్సికో హెల్త్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం అర్థరాత్రి విడుదల చేసిన నివేదిక ప్రకారం, గత రెండు వారాల్లో వేడి కారణంగా మరణాల కేసులు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది.

mexico heatwave

ఆరోగ్య మంత్రిత్వ శాఖ సాధారణంగా ప్రతి వారం వేడి మరణాలపై ఒక నివేదికను విడుదల చేస్తుంది. వేడిగాలుల కారణంగా మరణాల కేసులను నివేదించడంలో ఆలస్యంగా స్పందించింది. నివేదిక ప్రకారం, జూన్ 18.24లో అత్యధికంగా 69 మరణాలు నమోదయ్యాయి. ఇటీవలి వారాల్లో, మెక్సికోలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి.

జూన్ 11 , 17 మధ్య, దేశంలో 31మంది వేడిగాలుల కారణంగా మరణించారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు, ఉత్తర సరిహద్దు రాష్ట్రమైన న్యూవో లియోన్ హీట్‌స్ట్రోక్ డీహైడ్రేషన్ కారణంగా అత్యధిక మరణాలను సంభవించాయని అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు