ఏపీలో మారనున్న రైల్వేస్టేషన్ల రూపురేఖలు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద ఏపీలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారనున్నాయి. ముందుగా తొలి దశలో విజయవాడ డివిజన్‌లోని మొత్తం 11 స్టేషన్లను తొలిదశలో ఎంపిక చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

New Update
ఏపీలో మారనున్న రైల్వేస్టేషన్ల రూపురేఖలు

తొలి దశలో 11 స్టేషన్లు.. 

ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే స్టేషన్లకు మహర్దశ పట్టబోతోంది. రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్లు అధికారులు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన స్టేషన్లలో త్వరలోనే ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్లను రూపొందించడానికి నిపుణుల కమిటీలను ఇప్పటికే నియమించారు. మాస్టర్ ప్లాన్లను రూపొందించిన తర్వాత దశలవారీగా పనులు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద తొలి విడతగా విజయవాడ డివిజన్‌లోని మొత్తం 11 స్టేషన్లను తొలిదశలో ఎంపిక చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ జాబితాలో ఒంగోలు, అనకాపల్లి, భీమవరం టౌన్‌, కాకినాడ టౌన్‌, తుని, ఏలూరు, నరసాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, తెనాలి, సింగరాయకొండ స్లేషన్లు ఉన్నాయి.

అందుబాటులోకి చాలా సౌకర్యాలు.. 

ఈ రైల్వే స్టేషన్‌లలో విశాలమైన ప్లాట్‌ఫాంలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆయా స్టేషన్ల అభివృద్ధికి సంబంధించి ప్రజలను కూడా భాగస్వాముల్ని చేయనున్నారు. స్టేషన్ల అభివృద్ధిపై ప్రయాణికుల నుంచి సూచనలు కోరారు. ఆగస్టు 3లోగా తమ సూచనలను ఈ-మెయిల్‌, ట్విట్టర్ ద్వారా పంపించవొచ్చని అధికారులు తెలిపారు. స్టేషన్ల వారీగా ఈ-మెయిల్‌ అడ్రస్‌లు, హ్యాష్‌ట్యాగ్‌ల వివరాలను కూడా వెల్లడించారు.

ఏపీలో 72 స్టేషన్లు ఎంపిక.. 

దేశంలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొదట్లో అమృత్ భారత్ స్టేషన్ స్కీం ప్రవేశపెట్టింది. ఈ స్కీంలో దేశవ్యాప్తంగా 1,275 రైల్వే స్టేషన్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ టౌన్, ఏలూరు, విజయనగరం, అనకాపల్లి, అరకు, భీమవరం టౌన్, బొబ్బిలి, చీపురుపల్లి, తిరుపతి, అనంతపురం, తెనాలి, గుంటూరు, అనపర్తి, బాపట్ల, చీరాల, చిత్తూరు, కడప, కంభం, ధర్మవరం, డోన్, దొనకొండ, దువ్వాడ, ఎలమంచిలి, ఏలూరు, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గూడూరు, గుణదల, హిందూపూర్, ఇచ్చాపురం, కదిరి, కొత్తవలస, కుప్పం, కర్నూల్ సిటీ, మాచర్ల, మచిలీపట్నం, మంగళగిరి, మదనపల్లి రోడ్, మార్కాపురం రోడ్డు, మంత్రాలయం రోడ్, నడికుడి, నంద్యాల, నరసరావుపేట, నరసాపూర్, నౌపడ, నెల్లూరు, నిడదవోలు, ఒంగోలు, పాకాల, పలాస, పార్వతీపురం, పిడుగురాళ్ల, పీలేరు, రాజంపేట, రాయనపాడు, రేణిగుంట, రేపల్లె, సామర్లకోట, సత్తెనపల్లి, సింహాచలం, సింగరాయకొండ, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం రోడ్, సూళ్ళూరుపేట, తాడేపల్లిగూడెం, తుని, తాడిపత్రి, వినుకొండ రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు