PAN Card: 11.5 కోట్ల పాన్‌ కార్డులు డీ యాక్టివేట్‌ ..కేంద్రం ఏం తెలిపిందంటే!

కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ తో అనుసంధానం కానీ 11 కోట్ల పాన్‌ కార్డులను డీ యాక్టివేట్‌ చేసినట్లు ప్రకటించింది. 70. 24 కోట్లు పాన్‌ కార్డులు ఉండగా అందులో కేవలం 57. 25 కోట్లు మంది మాత్రమే ఆధార్‌ తో పాన్‌ ని అనుసంధానం చేసుకున్నారని వివరించింది.

PAN Card: 11.5 కోట్ల పాన్‌ కార్డులు డీ యాక్టివేట్‌ ..కేంద్రం ఏం తెలిపిందంటే!
New Update

నేడు దేశంలో ప్రతి ఒక్కరు ఆధార్‌ కార్డుల, పాన్ కార్డులు తప్పని సరిగా కలిగి ఉండాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఏ రంగంలో నైనా ఏదైనా సేవను తీసుకోవాలనుకుంటే ఆధార్‌ కార్డు తప్పనిసరి. బ్యాంకింగ్‌ లావాదేవీలకు సంబంధించినంత వరకు ఆధార్‌ కార్డు లింక్‌ అయి ఉన్న పాన్‌ కార్డు తప్పని సరి.

అందుకే దేశంలో సుమారు 70.24 కోట్ల మంది పాన్‌ కార్డును కలిగి ఉన్నారని అధికారక గణాంకాలు తెలిపాయి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం 11. 5 కోట్ల పాన్‌ కార్డులను డీయాక్టివేట్‌ చేసింది. వివరాల్లోకి వెళ్తే..ప్రస్తుతం పాన్‌ కార్డు అప్లై చేసుకునే వాళ్లకి, 2017 తరువాత పాన్‌ కార్డు తీసుకున్న వారికి ఆధార్‌ లింక్‌ అయి ఉంది. కానీ అంతకంటే ముందుగా పాన్‌ తీసుకున్న వారికి ఆధార్‌ లింక్‌ చేసి లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చాలా కాలం నుంచి పాన్‌ కి ఆధార్‌ లింక్‌ చేయమని చెబుతోంది.

Also read: ఘోర రోడ్డు ప్రమాదం..ఆగి ఉన్న బస్సును ఢీకొన్న ట్రక్కు..ఆరుగురు మృతి!

దాని కోసం వివిధ దఫాలుగా గడువును కూడా పొడిగిస్తూ వచ్చింది. ఈ ఏడాది జూన్‌ 30 తో ముగిసింది. ఈ నేపథ్యంలోనే 12 కోట్లకు పైగా పాన్‌ కార్డులు ఆధార్‌ తో లింక్‌ కానట్లు కేంద్రం గుర్తించింది. దీంతో ఆధార్‌ తో లింక్‌ కానీ 11. 5 కోట్ల పాన్‌ కార్డులను డీయాక్టివేట్‌ చేసింది. దీని గురించి సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ కార్యకర్త ఒకరు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం ను కోరారు.

దాంతో సీబీడీటీ సమాధానం తెలిపింది. నిర్ణీత గడువు లోగా ఆధార్‌ తో అనుసంధానం చేయ్యని పక్షంలో 11. 5 కోట్ల పాన్‌ కార్డులను డీ యాక్టివేట్‌ చేసినట్లు పేర్కొంది. 70. 24 కోట్లు పాన్‌ కార్డులు ఉండగా అందులో కేవలం 57. 25 కోట్లు మంది మాత్రమే ఆధార్‌ తో పాన్‌ ని అనుసంధానం చేసుకున్నారని వివరించింది.

ఈ క్రమంలో ఎవరైతే గడువులోపు పాన్ కి ఆధార్ ను అనుసంధానం చేయించుకోలేదో వాళ్ళ పాన్ కార్డులు డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడించింది.

#pan-card #rta #deactivate
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe