Board Exams: ఇకపై ఏడాదిలో రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు ఎగ్జామ్స్!

విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులు చేయబోతున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఏడాదిలో రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే యేడాది నుంచి అమలు చేస్తామని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు.

New Update
Board Exams: ఇకపై ఏడాదిలో రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు ఎగ్జామ్స్!

Students Can Write Board Exams Twice-a-year: విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఇకపై ఏడాదిలో రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షల (10th and 12th Board Exams)ను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పద్ధతి వచ్చే ఏడాది అకడమిక్‌ సెషన్‌ నుంచి అమలు చేయబోతున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan) అధికారికంగా ప్రకటించారు.

2025-26 నుంచి అమలు..
ఈ మేరకు మంగళవారం ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పుర్‌లో పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్‌ రైజింగ్‌ ఇండియా) పథకాన్ని ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. '2025-26 అకడమిక్‌ సెషన్‌ నుంచి 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను విద్యార్థులు ఏడాదిలో రెండు సార్లు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో బెస్ట్ స్కోర్ (Best Score) సాధించే అవకాశం ఉంటుంది. విద్యార్థుల ఒత్తిడిని దూరం చేసి, నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2047 నాటికి ఈ ఫార్ములా దేశాన్ని వికసిత భారతంగా తీర్చిదిద్దుతుంది' అని ధర్మేంద్ర తెలిపారు.

ఇది కూడా చదవండి : AP: రేపల్లెలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి భారీ చేరికలు!

కొత్త కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌..
ఇక స్కూల్ ఎడ్యూకేషన్ కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ గతేడాది ఆగస్టులో కొత్త కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను తయారు చేసింది. అయితే ఆ ప్రకారమే టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు ఒకే ఏడాదిలో రెండుసార్లు నిర్వహించనున్నారు. ఈ పద్ధతి ద్వారా విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేందుకు తగినంత సమయం దొరకుందని, వారి పనితీరు కూడా కనబరిచేందుకు అవకాశం ఉటుందని విద్యాశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

మరి ఈ ఎగ్జామ్స్ సెమిస్టర్‌ ప్రకారం నిర్వహిస్తారా? లేక మొత్తం సిలబస్‌పై రెండు సార్లు నిర్వహిస్తారా? అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం 11, 12 తరగతుల విద్యార్థులు రెండు లాంగ్వేజ్‌లను తప్పనిసరి అభ్యసించాలి. ఇందులో ఒకటి తప్పనిసరిగా భారతీయ భాష అయి ఉండాలని ప్రకటణలో పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు