T Congress: 119 సీట్లు.. 1000 దరఖాస్తులు.. అప్లై చేయని టీకాంగ్రెస్ కీలక నేతలు ఎవరంటే? వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ తరపున పోటీ కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. సీటు కోసం దాదాపు వెయ్యి మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 18న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటి(ఆగస్టు 25)తో ముగిసింది. By BalaMurali Krishna 25 Aug 2023 in రాజకీయాలు హైదరాబాద్ New Update షేర్ చేయండి ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ తరపున పోటీ కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. సీటు కోసం దాదాపు వెయ్యి మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 18న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటి(ఆగస్టు 25)తో ముగిసింది. అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గం నుంచి 38 దరఖాస్తులు వచ్చాయి. అయితే కొంతమంది కీలక నేతలు సీటు కోసం దరఖాస్తు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. దరఖాస్తు చేయని కీలక నేతలు.. మాజీ మంత్రి జానారెడ్డి, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి, నాగం జనార్దన్ రెడ్డి, గీతారెడ్డి, వి.హనుమంతరావు దరఖాస్తు చేయలేదు. మరోవైపు ఏడుగురు ఎన్నారైలు సీటు కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. పాలకుర్తి నుంచి డాక్టర్ ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి, అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి.. మక్తల్ నుంచి పోలీస్ చంద్రారెడ్డి, కల్వకుర్తి నుంచి రాఘవేందర్ రెడ్డి సుంకిరెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ నుండి కంది శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల నుంచి మన్యం రాజశేఖర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. శనివారం నుంచి దరఖాస్తుల స్క్రూటిని.. అలాగే హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల నుంచి జార్జిరెడ్డి సినిమా నిర్మాత అప్పిరెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తమ్ దంపతులు దరఖాస్తు చేసుకున్న రెండు స్థానాల్లో హుజూర్ ఆయన దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఉత్తమ్ అనుచరుడిగా ఉన్న అప్పిరెడ్డి ఇరువురు పోటీ చేసినా మద్దతు ఇస్తానని, తనకు అవకాశం ఇచ్చినా తాను పోటీ చేస్తానని వెల్లడించారు. శనివారం నుంచి దరఖాస్తుల స్క్రూటిని ఉంటుంది. సోమవారం టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ముఖ్య నేతలు దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గాలను ఓ సారి పరిశీలిస్తే.. ☛ కొడంగల్– రేవంత్ రెడ్డి ☛ మధిర– భట్టి విక్రమార్క ☛ హుజూర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి ☛ నల్లగొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి ☛ కామారెడ్డి– షబ్బీర్ అలీ ☛ వరంగల్ తూర్పు– కొండా సురేఖ ☛ పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం– పొంగులేటి శ్రీనివాసరెడ్డి ☛ ఆంధోల్– దామోదర రాజనర్సింహ ☛ మంథని– శ్రీధర్ బాబు ☛ సంగారెడ్డి- జగ్గారెడ్డి ☛ కోదాడ– పద్మావతి రెడ్డి ☛ నాగార్జున సాగర్– జైవీర్ రెడ్డి (జానారెడ్డి చిన్న కుమారుడు) ☛ మిర్యాలగూడ– రఘువీర్ రెడ్డి (జానారెడ్డి పెద్ద కుమారుడు) ☛ ఎల్బీ నగర్– మధు యాష్కీ గౌడ్ ☛ జనగాం- పొన్నాల లక్ష్మయ్య ☛ ములుగు- సీతక్క ☛ పినపాక- సూర్యం (సీతక్క కుమారుడు) ☛ వనపర్తి– చిన్నారెడ్డి ☛ ముషీరాబాద్– అంజన్ కుమార్, అనిల్ కుమార్ ☛ జగిత్యాల – జీవన్ రెడ్డి ☛ తుంగతుర్తి– అద్దంకి దయాకర్ ☛ మంచిర్యాల- ప్రేమ్ సాగర్ రావు ☛ హుస్నాబాద్- పొన్నం ప్రభాకర్ ☛ సికింద్రాబాద్ కంటోన్మెంట్ -సర్వే సత్యనారాయణ ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో విజయం సాధిస్తుంది #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి