అమ్మాయిలకు చదువు ఎందుకు? తండ్రి అడిగిన ప్రశ్నకు కూతురు అదిరిపోయే సమాధానం By Shareef Pasha 14 Jul 2023 in ఇంటర్నేషనల్ Scrolling New Update షేర్ చేయండి చదువుకున్న పవర్ గురించి తెలిసిన వారెవరు అయినా పిల్లలను చదివించడంలో ముందుంటారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కాలంలో చదువుకుంటే భవిష్యత్ భరోసాగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అబ్బాయిలతో పోటీ పడి మరీ అమ్మాయిలు చదువుకుని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. కానీ కొన్ని దేశాల్లో ఆడబిడ్డలను చదువుకు దూరం చేస్తున్నారు. అలాంటి దేశమే తాలిబన్ల రాజ్యమైన ఆఫ్ఘనిస్తాన్. View this post on Instagram A post shared by The Afghan (@theafghan) ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు రాజ్యం ఏలుతున్న దగ్గరి నుంచి ఆ దేశ ప్రజలు బాధలు వర్ణనాతీతం. ముఖ్యంగా బాలికలను చదువుకు దూరం చేశారు. పాఠశాలలు, యూనివర్సిటీల్లో అమ్మాయిలకు ప్రవేశం నిషేధించారు. ఇలాంటి తరుణంలో స్కూలుకి వెళ్లాలని కలలు కంటున్న ఓ చిన్నారికి తండ్రి అడిగిన ఓ ప్రశ్నకు చక్కటి సమాధానం ఇచ్చింది. ఆ చిన్నారి తెలివి తేటలు, ఆత్మ విశ్వాసం అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. ఆ వీడియోలో ఏముందంటే అబ్బాయిలు మాత్రమే చదువుకోవాలి .. నీ అన్నయ్యని మాత్రమే స్కూలుకి పంపుతాను అని తండ్రి బాలికకు చెబుతాడు. నువ్వు స్కూల్‌కి వెళ్లి ఏం సాధిస్తావని అడుగుతాడు.. ఇందుకు తాను డాక్టర్ లేదా టీచర్ అవుతాను అని సమాధానం చెప్పింది. చదువుకి లింగ బేధం లేదని.. విద్య అందరిదీ అని పేర్కొంది. మనుషులు నాశనం చేసే వస్తువులు ఏవి? అని మరో ప్రశ్న అడిగినపుడు ‘కాబూల్ నుంచి కాందహార్ వరకూ ఎన్ని ప్రదేశాలు నాశనం చేశారో మీరే వెళ్లి చూడండి.. మనం మన దేశాన్ని పునర్నిర్మించుకోవాలి’అని చెప్పడం అందరినీ ఆకట్టుకుంటుంది. theafghan అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో తండ్రి, కూతురు సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని సంవత్సరాల నుంచి అప్ఘనిస్తాన్ దేశం అంతర్గత యుద్ధంతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం, తాలిబన్లు మధ్య భీకర పోరు జరిగింది. ఈ పోరులో ఎంతోమంది అమాయకులు బలైపోయారు. ఎప్పుడు ఎక్కడ బాంబు బ్లాస్టులు జరుగుతాయో తెలియక మరెంతో మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటూ ఇతర దేశాలకు వలసవెళ్లారు. అటువంటి సమయంలో తాలిబన్లు ఆ దేశ రాజ్యాధికారం చేపట్టారు. ఇక అప్పటినుంచి ఆ దేశంలో అరాచకం తీవ్రమైంది. తాలిబన్లు చెప్పిందే వేదం.. వారి చేసిందే చట్టం. మాట కాదంటే బహిరంగ మరణశాసనం లిఖిస్తారు. ఆడబిడ్డలకు చదువు అవసరం లేదంటూ ఇంటికే పరిమితం చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి