మోదీ ఆశీర్వాదం కోసం రేవంత్ తాపత్రయపడుతున్నారు - హరీష్‌ రావు

New Update

మీడియాతో మాజీ మంత్రి హరీష్ చిట్‌చాట్. మోదీ ఆశీర్వాదం కోసం రేవంత్ తాపత్రయపడుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ గెలవదని రేవంత్ చెప్పకనే చెప్పారు. మోదీ మళ్లీ ప్రధాని అవుతారని రేవంత్ వ్యాఖ్యలు చెప్తున్నాయి - హరీష్‌. రేవంత్ ప్రజలనే కాదు..రాహుల్‌గాంధీని మోసం చేశారు. గుజరాత్‌ మోడల్ ఫెయిల్యూర్ అని రాహుల్ అంటే... గుజరాత్ మోడల్ కావాలని రేవంత్ అంటున్నారు.

కాంగ్రెస్ వచ్చింది..కరువు వచ్చింది
ఆరు గ్యారెంటీలపై నోటరీలిచ్చి ప్రచారం చేసిన కాంగ్రెస్‌పై కేసులు పెట్టాలి.కాంగ్రెస్‌కు ఓటు వేయాలో లేదో రైతులు నిర్ణయం తీసుకోవాలి.నిధులు దుర్వినియోగం అని చెప్పి ఆరుగురు పీఆర్వోలను ఎందుకు పెట్టుకున్నారు.వంద రోజుల పాలనలో ఏం ఒరిగిందని ఓటు వేయాలి.బాండ్ పేపర్లు రాసి ఇచ్చిన వారిపై కేసు పెట్టాలి.LRS ఉచితంగా చేస్తామన్నారు..ఇప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.అప్పుల గురించి ఆనాడూ మాట్లాడి..ఇప్పుడు రూ.16 వేల కోట్లు అప్పు చేశారు.ఆటో వాళ్లకు ఏడాదికి రూ.12 వేలు అన్నారు. ఏమైంది? వృద్ధులకు ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టారని హరీష్ రావు అన్నారు

Advertisment
Advertisment
తాజా కథనాలు