నెహ్రూ మెమోరియల్ పేరు మార్చిన కేంద్రం, తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న కాంగ్రెస్..!!

New Update

ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ పేరును మార్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. నెహ్రూ మెమోరియల్ ను ఇప్పుడు పీఎం మెమోరియల్ గా పేర్చు మార్చారు. ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం ప్రారంభోత్సవం జరిగిన దాదాపు ఏడాది తర్వాత, ఆ ప్రాంగణం నుండి నెహ్రూ పేరును తొలగించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Nehru memorial as pm memorial
ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ పేరు మార్చారు. ఇప్పుడు నెహ్రూ మెమోరియల్‌ని పీఎం మెమోరియల్‌గా పిలుస్తున్నారు. పేరు మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. పేరు మార్పు పగ, పక్షపాతం ఫలితమేనని కాంగ్రెస్ పేర్కొంది. భారత దేశ-రాజ్య వాస్తుశిల్పి పేరు , వారసత్వాన్ని వక్రీకరించం, కించపరచడం, నాశనం చేయడం తప్ప మోదీ ఇంకేం చేయలేరని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేశ్ మండిపడ్డారు. తన అభద్రతాభావాల కారణంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 59 సంవత్సరాలకు పైగా నెహ్రూ మెమోరియల్ మ్యూజియం & లైబ్రరీ (NMML) ప్రపంచ ల్యాండ్‌మార్క్, పుస్తకాలు & ఆర్కైవ్‌ల నిధిగా ఉంది. ఇక నుంచి దీనిని ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం & సొసైటీ అని పిలవాలన్న కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం, సొసైటీగా పిలవనున్నారు. మీడియా కథనాల ప్రకారం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఇందులో నెహ్రూ మెమోరియల్ పేరు మార్చే నిర్ణయానికి ఆమోదం లభించింది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి రాజ్‌నాథ్ సింగ్ వైస్ చైర్మన్. ప్రధానమంత్రి దీనికి చైర్మన్. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, జి కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ సహా 29 మంది సభ్యులు ఈ సొసైటీలో ఉన్నారు.

గత ఏడాది ఏప్రిల్‌లో తీన్ మూర్తి కాంప్లెక్స్‌లో మ్యూజియం ప్రారంభించారు. ఇది 1948 నుండి 1964లో మరణించే వరకు భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అధికారిక నివాసంగా పనిచేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు