ఒకప్పుడు తెలంగాణలో కరెంటు కష్టాలకు కారణమే కాంగ్రెస్! అసమర్థ, దుష్ట పాలన వల్ల రైతులు అరిగోస పడ్డారు. అందుకే ఆ పార్టీకి ప్రజలు చరమగీతం పాడారు. వ్యవసాయానికి కేవలం 3 గంటల కరెంటు చాలట. ఒక గంట కరెంటుతో ఒక ఎకరం పారించవచ్చట. వ్యవసాయం గురించి తెలిసినోడు మాట్లాడే మాటలేనా? కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలతో రైతులు నవ్వుకుంటున్నారు. నవ్వులపాలైన ఆ పార్టీని పాతాళంలో పాతి పెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ, జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండలం, ముత్తారం, పాలకుర్తి రైతు వేదికల వద్ద రైతులతో కలిసి నిర్వహించిన సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కాంగ్రెస్ వ్యాఖ్యలపై కన్నెర్ర చేశారు.
పూర్తిగా చదవండి..కరెంట్‌పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలంటూ మంత్రి ఎర్రబెల్లి ఫైర్
ఉచిత కరెంట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం ముత్తారం, పాలకుర్తి రైతు వేదికల వద్ద రైతులతో కలిసి నిర్వహించిన సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఉచిత విద్యుత్‌పై రేవంత్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. వ్యవసాయాన్ని దండుగ చేసిన పాపం కాంగ్రెస్‌దే కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడ్డారు. వేసవి సమావేశాలలో అయితే అసెంబ్లీ దద్దరిల్లేది కరెంటు కష్టాలు, కోతలతో, పవర్ హాలీడేలతో తల్లడిల్లినం వీటన్నింటికి సీఎం కేసీఆర్ తెర తీశారు. వ్యవసాయాన్ని పండుగ చేశారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

Translate this News: