అన్స్టాపబుల్ షోకు బాలీవుడ్ స్టార్ హీరో..నెట్టింట్లో ఫొటోలు వైరల్.! By Jyoshna Sappogula 14 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Ranbir Kapoor: ‘యానిమల్’ మూవీ డిసెంబరు 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, నేషనల్ క్రష్ హీరోయిన్ రష్మిక మందన్న నటించిన సినిమా 'యానిమల్'. సందీప్ రెడ్డి వంగా దీనికి దర్శకుడు. ఈ మూవీపై అటు బాలీవుడ్ తోపాటు ఇటు టాలీవుడ్ లోనూ భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసి మాంచి బ్లాక్ బస్టర్ అందుకోవాలని దర్శకుడు భావిస్తున్నారు. తాజాగా, 'అన్ స్టాపబుల్' నెక్ట్స్ ఎపిసోడ్ లో 'యానిమల్' టీమ్ సందడి చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. షో లో పాల్గొనేందుకు హీరో రణబీర్ కపూర్ ముంబై నుంచి హైదరాబాద్ లో అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుందని కూడా అంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే ‘బ్రహ్మాస్త’ సినిమాతో తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన, ఈ సినిమాతో మరింత ఫ్యాన్ బేస్ పెంచుకోవాలని భావిస్తున్నారు. అందుకే ‘యానిమల్’ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమోషన్ లో భాగంగానే హీరో రణబీర్ కపూర్ పలు రియాలిటీ షోలతో పాటు టాక్ షోలలోనూ పాల్గొనబోతున్నారు.ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని కలసి నిర్మిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు వ్యాఖ్యాతగా వహారిస్తున్నారు. 'అన్ స్టాపబుల్' కార్యక్రమాన్ని బాలయ్య గత రెండు సీజన్లుగా విజయవంతంగా నడిపిస్తున్నారు. తనదైన శైలిలో కామెడీ పంచ్ లు, సెటైర్లు, ముక్కుసూటి ప్రశ్నలతో కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఇటీవల మూడో సీజన్ ఓపెనింగ్ ఎపిసోడ్ లో 'భగవంత్ కేసరి' టీమ్ పాల్గొంది. Also Read: ఆ స్టార్ హీరోతో తగ్గేదేలే అంటున్న పాయల్ రాజ్పుత్.! #ranbeer-kapoor #animal-movie-team #balakrishna-unstoppable మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి