YS Sharmila: వైఎస్ షర్మిల నిరాహార దీక్ష, లోటస్ పాండ్ దగ్గర హై టెన్షన్ !!

వైసీపీటీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హౌస్ అరెస్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గమై గజ్వేల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు లోటస్‌పాండ్‌లోని ఆమె ఇంటి వద్ద భారీగా మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

New Update
YS Sharmila: వైఎస్ షర్మిల నిరాహార దీక్ష, లోటస్ పాండ్ దగ్గర హై టెన్షన్ !!

YS Sharmila in Hunger Strike: వైసీపీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరాహారదీక్షకు దిగారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఆమె దీక్ష చేయనున్నారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) నియోజకవర్గం పర్యటనకు పోలీసులు అనుమతించకుండా హౌస్ అరెస్ట్ చేయడంతో నిరసనగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. లోటస్‌పాండ్ నివాసం నుంచి షర్మిల బయటకు రాకుండా పోలీసులు ఆమె ఇంటి వద్ద భారీగా మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె పర్యటన వల్ల శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది అని భావించిన పోలీసులు పర్యటనకు అనుమతి లేదని తెలిపారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన షర్మిల పోలీసులకు హారతి ఇచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. తాను పర్యటన చేసి తీరుతానని తేల్చిచెబుతున్నారు. దళిత బందు పథకంలో (Telangana Dalit Bandhu) అక్రమాలు జరిగాయని ఇటీవల జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామాల్లో ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో పర్యటించి స్థానికులకు మద్దతు తెలపాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు.

తన ట్విట్టర్(X)అకౌంట్‌లో సీఎం కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలతో గురువారం ఆమె ట్వీట్ చేశారు. "భూ బకాసురుడు కేసీఅర్(CM KCR). అడిగేటోడు లేడని సర్కారీ భూములపై దొర ఇష్టారాజ్యం నడుస్తోంది. కావాల్సింది కాజేయడం, ఆదాయం అని ఉన్నది అమ్మేయడం ఇదే రెండు దఫాలుగా కేసీఆర్ నడుపుతున్న భూముల దందా. తనకు నచ్చిన రేటుకే కబ్జాలు చేస్తూ ప్రజలకు మాత్రం కాంపిటీషన్ పెడుతున్నడు. జిల్లాల్లో పార్టీ ఆఫీసుల పేరిట రూ.వెయ్యి కోట్లు విలువజేసే 33.72 ఎకరాల భూములను రూ.3 కోట్లకే అప్పనంగా కొట్టేశారు. ఎకరం రూ.100 కోట్లు పలికే కోకాపేటలో దొర గారి భారతీయ భవన్ కోసం రూ.3.41 కోట్లకే 11ఎకరాలు దోచేశారు. దాదాపు రూ.1100 కోట్లు విలువ చేసే భూమిని అప్పనంగా పార్టీ ఆఫీసుకు లాక్కున్నారు. ప్రభుత్వ పనులకు పనికొచ్చే భూములన్నీ దొర గారి సొంత పార్టీ అవసరాలకు,ఆయన బినామిలకు ఉపయోగ పడుతున్నయ్. హైకోర్టు మొట్టికాయలు వేసినా, జనం దుమ్మెత్తిపోసినా తుడుచుకొనిపోతున్నాడు కానీ దొర గారిలో మార్పు రావడం లేదు. కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. మీరు రాయించుకున్న అత్యంత విలువైన కొకపేట భూములను వెంటనే ప్రభుత్వపరం చేయండి. లేదా ఎకరం రూ.100 కోట్ల లెక్కన రూ.11వందల కోట్లను మీ పార్టీ అకౌంట్ లో మూలుగుతున్న రూ.12వందల కోట్ల నుంచి కట్టండి" అని పేర్కొన్నారు.

గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ పెద్దలను టార్గెట్ చేస్తూ షర్మిల ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ వెళ్తే అక్కడ కూడా ప్రజలను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే షర్మిలను హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు