/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/police-5.jpg)
Ongole : ప్రకాశం జిల్లా (Prakasam District) లోని వైసీపీ (YCP) క్యాడర్ కు వైఎస్ఆర్ జయంతి (YSR Jayanthi) సందర్భంగా నిరాశ ఎదురైంది. నూతన కార్యాలయం వద్ధ జరగాల్సిన జయంతి వేడుకలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో జయంతి వేడుకల వేదిక మారింది. కార్యక్రమం వేదిక మార్చాల్సి రావడంతో పార్టీ క్యాడర్ కాస్తా గందరగోళంలో పడింది.
Also Read: ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి ఉండేది కాదు.. రాహుల్ గాంధీ స్పెషల్ వీడియో..!
ఇక చేసేదేమీ లేక పార్టీ శ్రేణులు వేదిక మార్చుకున్నారు. JMB చర్చ్ సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైసీపీ నూతన కార్యాలయం కాలీ జండతో ఉండగా పార్టీ శ్రేణులు నిరుత్సాహం చెందుతున్నారు. ఇదిలా ఉంటే జిల్లా కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.