YSR Aasara : డ్వాక్రా మహిళలకు భరోసా.. నేడు 'వైఎస్సార్‌ ఆసరా' పంపిణీ!

ఇవాళ ఉరవకొండ పట్టణంలో ఏపీ సీఎం జగన్‌ పర్యటించనున్నారు. 'వైఎస్ఆర్ ఆసరా' పథకం ప్రయోజనాలను మహిళా స్వయం సహాయక సంఘాలకు విడుదల చేయనున్నారు. 78,94,169మంది మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు నాల్గవ విడతగా రూ.6,394.83కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది.

New Update
YSR Aasara : డ్వాక్రా మహిళలకు భరోసా.. నేడు 'వైఎస్సార్‌ ఆసరా' పంపిణీ!

YSR AASARA Funds : 'వైఎస్‌ఆర్‌ ఆసరా' పథకం(YSR Aasara Scheme) కింద 78,94,169 మంది మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు నాల్గవ విడతగా రూ.6,394.83 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఏపీ ప్రభుత్వం అందించనుంది. ఇవాళ(జనవరి 23) అనంతపురం జిల్లా ఉరవకొండ(Uravakonda) లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 'వైఎస్సార్‌ ఆసరా' నిధులు విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద 7,98,395 స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేసే ప్రక్రియను సీఎం ప్రారంభించనున్నారు. దీనికి రెండు వారాల సమయం పడుతుంది.

వరుసగా నాలుగోసారి:
'వైఎస్ఆర్ ఆసరా' పథకంలో భాగంగా సెప్టెంబర్ 11, 2020న మొదటి దశ పంపిణీలో 77,87,295 మంది మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు సీఎం రూ.6,318.76 కోట్లు డిపాజిట్ చేశారు. అక్టోబర్ 7, 2021న రెండో ఫేజ్‌లో 78,75,539 మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు సీఎం రూ.6,417.69 కోట్లు డిపాజిట్ చేశారు. ఇక మూడో దశ మార్చి 23, 2023లో 78,94,169 మంది మహిళలకు ప్రయోజనం చేకూరేలా రూ.6,417.69 కోట్లను విడుదల చేశారు.

మహిళలకు ప్రయోజనం చేకూరేలా:
వైసీపీ ప్రభుత్వం 56 నెలల క్రితం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి DBT, నాన్-DBT పథకాల కింద మహిళలకు మాత్రమే రూ.2,66,772.55 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని అందించింది. దీనివల్ల మహిళలు తమ జీవనోపాధిని మెరుగు పరుచుకోవడంతో పాటు సొంతంగా నిలదొక్కుకునేందుకు దోహదపడింది. కార్పొరేట్ దిగ్గజాలు, బ్యాంకులతో టైఅప్ అవ్వడంతో దాదాపు 14,77,568 మంది మహిళలు కిరానా దుకాణాలు(General Stores), గార్మెంట్స్ వ్యాపారాలు మొదలైనవాటిని ఏర్పాటు చేయడంలో సహాయపడింది. చాలా మంది పశువుల పెంపకం ప్రారంభించి నెలకు రూ. 7,000 నుంచి రూ. 10,000 వరకు అదనపు ఆదాయాన్ని ఆర్జించారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అమూల్‌(Amul) తో ఒప్పందం లీటరు పాలపై వచ్చే ఆదాయాన్ని రూ. 10 నుంచి రూ. 22కి పెంచడంలో సహాయపడిందని తెలుస్తోంది.

Also Read: ఇక కాస్కోండి తమ్ముళ్లు… షర్మిల రాజకీయ పోరాట యాత్ర వైపే అందరిచూపు..!
WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు