AP: ఢిల్లీలో మాజీ సీఎం జగన్ ధర్నా.. ఆ పార్టీ శ్రేణులే టార్గెట్‌గా.. ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ మరికాసేపట్లో ధర్నా చేయనున్నారు. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు నిరసనగా తన పార్టీ నేతలతో జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపనున్నారు. కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేయనున్నారు. By Jyoshna Sappogula 24 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి YS Jagan: మరికాసేపట్లో ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ ధర్నా చేపట్టనున్నారు. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు నిరసనగా జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపనున్నారు. ఈ ఉదయం 11 నుంచి సాయంత్ర 5 గంటల వరకు ధర్నా చేయనున్నారు. మాజీ సీఎం జగన్ తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ధర్నాలో పాల్గొననున్నారు. ఏపీలో వైసీపీ శ్రేణులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయని జోక్యం చేసుకోవాలని జగన్ కేంద్రాన్ని కోరనున్నారు. కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేయనున్నారు. ఇదిలా ఉంటే, ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ కు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదని.. అందుకే తప్పించుకుంటున్నాడని కౌంటర్లు వేస్తున్నారు. #ys-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి