YS Jagan: రాయి దాడి ఘటనపై సీఎం జగన్ స్పందించారు. తనపై ఒక రాయి వేసినంత మాత్రాన గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. దాడులతో అదరిలేది.. బెదరేది లేదన్నారు. తన నుదిటిపై గాయం 10 రోజుల్లో మానుతుంది కానీ చంద్రబాబు పేద ప్రజలకు చేసిన గాయం మానదన్నారు.. గుడివాడ దగ్గర నాగవరప్పాడులో జగన్ భారీ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read: జగన్ పై దాడి.. అధికారులు అలా ఎందుకు చేయలేదు: పవన్ కల్యాణ్ ప్రశ్నలు
దోచుకోవడం.. పంచుకోవడమే
పేదలకు మంచి చేయకూడదన్న వ్యక్తిత్వం చంద్రబాబుదని ఆయనకు తెలిసిందల్లా కుట్రలు చేయడం.. దోచుకోవడం.. దోచుకున్నది పంచుకోవడమేనని ఆరోపించారు. విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసింది..ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పులి నోట్లో తల పెట్టడమే..
చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమేనని మండిపడ్డారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎంత దారుణానికైనా ఒడిగడుతారని ఆరోపించారు. జగన్ అనే అర్జునుడికి ప్రజలనే కృష్ణుడి అండ ఉందని.. ఈ లాంటి దాడులు తననేమి చేయవని పేర్కొన్నారు. విపక్షాలు దిగజారాయంటే విజయానికి మనం చేరువుగా ఉన్నామని అర్ధమన్నారు.