AP Politics: బొత్సకు కేబినెట్ ర్యాంక్ పదవి.. జగన్ సంచలన నిర్ణయం! ఇటీవల విశాఖ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణకు మరో కీలక పదవి దక్కనుంది. ఆయనను శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా నియమించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు కేబినెట్ హోదా లభించనుంది. By Nikhil 21 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి YS Jagan Takes Sensational Decision To Botsa Satyanarayana : ఎమ్మెల్సీగా ఈ రోజు ప్రమాణ స్వీకారం (Oath Ceremony) చేసిన బొత్స సత్యనారాయణకు వైసీపీ (YCP) అధినేత జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. శాసనమండలి పక్ష నేతగా బొత్సను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రంలోగా ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటివరకు ఆ పార్టీ శాసనమండలి పక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి.. ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేశారు. జగన్ ఆదేశాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. శాసనమండలిలో ఇప్పటికీ వైసీపీకే ఆధిక్యం ఉంది. ఈ నేపథ్యంలో బొత్స వైసీపీ పక్ష నేతగా ఎన్నికైతే ఆయనకు కేబినెట్ హొదా దక్కనుంది. అసెంబ్లీలో పదో వంతు ఎమ్మెల్యే సీట్లు దక్కకపోవడంతో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: Supreme Court : ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కు భారీ ఊరట బొత్సకు కలిసొచ్చిన అంశం ఇదే.. ఉత్తరాంధ్రలో బొత్స బలమైన నేతగా ఉన్నారు. ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. గత ఎన్నికల్లో బొత్స చీపురుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి.. ఆయన సతీమణి ఝాన్సీ విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగారు. అయితే.. ఆ ఎన్నికల్లో వీరిద్దరూ ఓటమి పాలయ్యారు. అయితే.. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న వంశీ కృష్ణ అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీని వీడి జనసేనలో చేరారు. దీంతో ఆ సమయంలో మండలి చైర్మన్ ఆయనపై అనర్హత వేటు వేశారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానానికి ఇటీవల ఎన్నికల కమిషన్ (Election Commission) నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఇక్కడ దాదాపు 800 ఓట్లు ఉండగా.. టీడీపీ (TDP) కి కేవలం 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ఈ నేపథ్యలో ఎన్నికల బరి నుంచి ఆ పార్టీ ఆఖరి నిమిషంలో తప్పుకుంది. దీంతో వైసీపీ నుంచి పోటీకి దిగిన బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో బలమైన బీసీ నేత అయిన బొత్సను శాసనమండలి పక్ష నేతగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. #ys-jagan #ap-election-commission #botsa-sathyanarayana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి