ఎప్పటికీ యవ్వనంగా కనిపించేలా చేసే కోకోనట్ వాటర్!

కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు చర్మం పొడిబారకుండా, ముడతలు పడకుండా యవ్వనంగా ఉండేందుకు సహకరిస్తాయి.డీ హైడ్రేటయిన శరీరాన్ని రిఫ్రెష్ చేయటంలో కొబ్బరి నీళ్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది.

New Update
ఎప్పటికీ యవ్వనంగా కనిపించేలా చేసే కోకోనట్ వాటర్!

కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు చర్మం పొడిబారకుండా, ముడతలు పడకుండా యవ్వనంగా ఉండేందుకు సహకరిస్తాయి.డీ హైడ్రేటయిన శరీరాన్ని రిఫ్రెష్ చేయటంలో కొబ్బరి నీళ్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేక ఖనిజ లవణాలు  ఔషధ గుణాలు వీటిలో ఉన్నాయి.ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరి నీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ కిడ్నీల పనితీరుకు తోడ్పడతాయి.

గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో వాంతులు కారణంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో నీటిశాతం పెరుగుతుంది.కొబ్బరి నీటిలో చాలా ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ,యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మరియు రక్తపోటు నియంత్రణ, గుండె ఆరోగ్యం, మెరుగైన రక్తంలో చక్కెర స్థాయిలు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

కొబ్బరి నీళ్లు శరీరానికే కాకుండా జుట్టుకు కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను కొద్ది మొత్తంలో కొబ్బరి నీళ్లతో కలిపి షాంపూ, కండీషనర్‌తో మీ జుట్టును కడిగిన తర్వాత, ఈ మిశ్రమాన్ని మీ తల  జుట్టు అంతటా అప్లై చేసి, సుమారు 1 నిమిషం పాటు నాననివ్వండి. ఆపై మీ జుట్టును  నీటితో శుభ్రం చేసుకోండి. ఇది జుట్టు సంబంధిత సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది.

విటమిన్ సి, అమినో యాసిడ్స్ చర్మ సమస్యలను నయం చేయడంలో ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. అలాగే కొబ్బరి నీళ్లలో పసుపు, చందనం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.మంచినీటిలో ఉండే సహజసిద్ధమైన విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి చర్మ సమస్యలను దూరం చేస్తాయి. ఇందులో ఉండే సైటోకిన్స్ అనే ప్రొటీన్, కణాల విస్తరణలో సహాయపడుతుంది. మీ చర్మపు రంగును సమం చేస్తుంది. ఇలా చేయడం వల్ల ముడతలు రావడం ఆలస్యమై చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

Advertisment
తాజా కథనాలు