ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎలాంటి సమస్యలు వస్తాయంటే..! మనలో O+, O-, A+, A-, B+, B-, AB+, AB- ఈ 8 రకాల బ్లడ్ గ్రూపుల్లో ఒకటి ఉంటుంది. ప్రతీ బ్లడ్ గ్రూప్ దాని సొంత లక్షణాలను కలిగి ఉంటాయి. మన బ్లడ్ గ్రూప్ ఆధారంగా మనకు వచ్చే వ్యాధుల ముప్పును ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 27 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి ప్రతీ బ్లడ్ గ్రూప్ దాని సొంత లక్షణాలు ఉంటాయి. చాలా మంది బ్లడ్ గ్రూప్ తెలిస్తే... రక్తం దానం చేయడానికి, అవయవ దానం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు. మన బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలిస్తే.. మనకు వచ్చే ఆనార్యోగాల ముప్పును కూడా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. A బ్లడ్ గ్రూప్‌కి చెందిన వారికి, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం. ఈ టైప్ బ్లడ్ ఉన్న వ్యక్తులలో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల మానసిక ఆరోగ్య సవాళ్లను అధిగమించడంలో ఇబ్బంది ఉంటుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రతిరోజు 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలి. O బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం తక్కువ. అదే సమయంలో.. A, B, AB బ్లడ్ గ్రూప్ వారికి కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. O బ్లడ్ గ్రూప్ వారికి.. అధిక కొలెస్ట్రాల్, అధిక మొత్తంలో గడ్డకట్టే ప్రోటీన్ ఉండే అవకాశం ఇతరల కంటే.. తక్కువగా ఉండటం వల్ల వీరికి గుండె సమస్యల ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదం A, AB మరియు B బ్లడ్ గ్రూప్‌ల వారికి ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి, టైప్ A ఉన్నవారికి ఈ రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. H. పైలోరీ ఇన్‌ఫెక్షన్ A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా కడుపులో కనిపించే బ్యాక్టీరియా. వాపు, పూతలకి కారణమవుతుంది. దీనితో పాటు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. #blood-group-and-diseases మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి