యోగిని శాంభవి మళ్ళీ ప్రత్యక్షం.. వీరబ్రహ్మం గారిపై సంచలన వ్యాఖ్యలు

పోతులూరి వీర బ్రహ్మ స్వామిపై యోగిని శాంభవి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో బ్రహ్మంగారు మళ్లీ వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తారని తెలిపారు. బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరిగాయని, జరుగుతున్నాయని తెలిపారు.

యోగిని శాంభవి మళ్ళీ ప్రత్యక్షం.. వీరబ్రహ్మం గారిపై సంచలన వ్యాఖ్యలు
New Update

Yogini Shambhavi: కొన్నేళ్ల క్రితం తన ఆధ్యాత్మిక ప్రవచనాలతో అత్యంత ప్రజాధరణ పొందిన చిన్నారి యోగిని శాంభవి మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. సుమారు 13 ఏళ్లుగా ఎవరికీ కనిపించని యోగిని శాంభవి ఇప్పుడు అకస్మాత్తుగా మహనంది మండలంలో ప్రత్యక్షమవడం.. వీరబ్రహ్మం గారి గురించి సంచలనం వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పెరిగి పెద్దదయిన శాంభవి.. ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లారు ? బ్రహ్మం గారి గురించి చేసిన వ్యాఖ్యలేంటి ? పూర్తి వివరాల్లోకి వెళితే..

2009, 2010 సంవత్సర కాలంలో.. నంద్యాల జిల్లా సూర్యనందిలో ఐదేళ్ల పసిప్రాయంలో భవష్యవాణి చెబుతూ అందరినీ ఆకట్టుకున్న శాంభవి ఇంకా అందరికి గుర్తే ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా జనాలు తరలి వచ్చి చిన్నారి శాంభవికి ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నంద్యాల నుంచి హిమాలయాలకు వెళ్లిపోయారు. అక్కడ ఆశ్రమంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చదువుతూ.. 13 ఏళ్ల తర్వాత మళ్లీ నంద్యాలకు వచ్చి సూర్యనందీశ్వర ఆలయంలో పోజులు నిర్వహించిన అనంతరం ఆర్టీవి తో మాట్లాడారు.

ఆధ్యాత్మిక ప్రవచనాలతో అందరిని ఆకట్టుకున్న చిన్నారి యోగిని శాంభవి పదమూడేళ్లుగా హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటూ.. చాలా ధార్మిక ప్రదేశాలు పర్యటిస్తూ ఆచార్యుల వద్ద సంస్కృతం వేదాలు నేర్చుకున్నానని చెప్పారు. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఇంగ్లీషులో ట్రాన్స్‌లేట్ చేస్తున్నట్లు శాంభవి ప్రకటించారు. త్వరలో బ్రహ్మంగారు మళ్లీ వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తారని, బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరిగాయని, జరుగుతున్నాయని తెలిపారు. బ్రహ్మం గారి అనుగ్రహంతోనే ఇక్కడి నుంచి హిమాలయాలకు వెళ్లడం జరిగిందని , ఆనాటి నుండి ఈ సూర్యనందిలో బ్రహ్మం గారికి భవ్యమైన ఆశ్రమం , గుడి కట్టాలని సంకల్పం ఉందని తెలిపారు. ఆయన మళ్ళీ ఇదే ప్రదేశానికి వస్తారని .. అయన వచ్చేలోగా ఇక్కడ ఒక ఆలయం ఉండాలని సంకల్పం తో మళ్ళీ ఇలా సూర్యనందికి రావడం జరిగిందని శాంభవి తెలిపారు. కార్తీక మాసం సందర్బంగా సూర్యనంది, నంద్యాల బస్టాండ్ పక్కన ఉన్న మధువర్ణ రామలింగం మందిరంలో శాంభవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో శాంభవితోపాటు స్థానికులు కూడా పాల్గొన్నారు.

Also Read:

టాలీవుడ్‌కు బిగ్ షాక్.. డ్రగ్స్‌ ఇష్యూపై సీఎం రేవంత్ ఫోకస్..

అలాంటి వ్యక్తి సీపీగా.. సీఎం రేవంత్ సాహసోపేత నిర్ణయం..

#yogini-shambhavi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి