Yoga: మహిళలకు ఎంతో ముఖ్యమైన యోగాసనాలు.. తప్పక తెలుసుకోండి..!

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా మహిళలు తప్పనిసరిగా చేయాల్సిన కొన్ని యోగాసనాల గురించి తెలుసుకుందాము. ఇవి మనస్సుతో పాటు శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. మలసానా, ఉత్తనాసన సాధన, బద్దకోనసనం.

Yoga: మహిళలకు ఎంతో ముఖ్యమైన యోగాసనాలు.. తప్పక తెలుసుకోండి..!
New Update

Yoga: మనస్సుతో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో యోగా ఎంతో సహాయపడుతుంది. ఈ సంవత్సరం యోగా థీమ్ పూర్తిగా మహిళలకు అంకితం చేయబడింది. మహిళలు నిత్యం యోగా సాధన చేస్తే అనేక వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ఈ సందర్భంగా మహిళల కోసం ముఖ్యమైన కొన్ని ముఖ్యమైన యోగా భంగిమలను ఇప్పుడు తెలుసుకుందాము. ఇవి ఎల్లప్పుడూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి.

మలసానా

మలసానా యోగా సాధన చేయడం వల్ల మహిళలు PCOD లక్షణాలను నివారించవచ్చు. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పెల్విక్ ఫ్లోర్ కండరాలను యాక్టీవేట్ చేస్తుంది. మలసానా తుంటి (hip) కండరాలను సాగదీయడంలో కూడా సహాయపడుతుంది.

మలసానా నుంచి ఉత్తనాసన సాధన

మలసానా భంగిమలో కూర్చున్న తర్వాత నిలబడి, తిరిగి మలసానా భంగిమలో కూర్చుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళన నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. వెన్నెముక అనువైనదిగా మారుతుంది. ఈ భంగిమ చేయడం వల్ల కడుపు లోపల అవయవాలు మసాజ్ చేయబడతాయి.

publive-image

బద్దకోనసనం

బద్ధకోనాసన అంటే సీతాకోకచిలుక భంగిమ. ఈ యోగాసనాన్ని చేయడానికి, నిటారుగా కూర్చుని రెండు పాదాల అరికాళ్లను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయండి. తర్వాత తొడలను సీతాకోకచిలుక రెక్కల మాదిరిగా పైకి క్రిందికి కదిలించండి. ఈ యోగాసనాన్ని ప్రతిరోజూ ఒకటి నుంచి మూడు నిమిషాలు సాధన చేయడం వల్ల శరీర భంగిమ మెరుగుపడుతుంది. అలాగే తుంటి కదలిక పెరుగుతుంది. పీరియడ్స్ సమయంలో నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అదే సమయంలో, సీతాకోకచిలుక భంగిమ మూత్రపిండాల ఆరోగ్యం, మహిళల్లో సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

మహిళలకు ఈ యోగా ఆసనాల వల్ల కలిగే ప్రయోజనాలు

మహిళలు రోజూ ఈ యోగాసనాలు వేస్తే, శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరిగి, గర్భం దాల్చడం కూడా సులభతరం అవుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతను నిర్వహించడానికి, పెల్విక్ కండరాలను బలపరుస్తుంది.

Also Read: Tooth Brush : టూత్ బ్రష్ ను ఇలా కవర్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..! - Rtvlive.com

#yoga
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe