/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ycp-mp-1-jpg.webp)
East Godavari: అల్లూరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీటీసీ దారుణ హత్యకు గురైయ్యారు. ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన MPTC వర్షాబాలకృష్ణ 40 దారుణంగా చంపబడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయితో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
Also Read: నేడు ముఖేశ్ అంబానీ బర్త్ డే.. ఆయన లైఫ్ సీక్రెట్స్ గురించి మీకు తెలుసా!
గ్రామంలో కొందరు వ్యక్తులతో జరిగిన గొడవ కారణంగా వారు బండరాయితో కొట్టి చంపినట్లు సమాచారం. కన్నాయిగూడెం గ్రామశివార్లలో ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న ఎటపాక పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Follow Us