Anil Kumar: గొర్రెలు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చాడు అన్నారు.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఎమోషనల్

15 సంవత్సరాలుగా ఉన్న నెల్లూరు నియోజకవర్గాన్నీ వదిలి వస్తుంటే బాధ వేసిందన్నారు నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. అయితే, పల్నాడు ప్రజలు స్వాగతించిన తీరు చూసి జగనన్న తీసుకున్న నిర్ణయం సరైనదేనని అన్నారు.

New Update
Anil Kumar: గొర్రెలు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చాడు అన్నారు.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఎమోషనల్

YCP MP Candidate MLA Anil Kumar: పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎమోషనల్ అయ్యారు. నెల్లూరులో ఇంట్లో నుండి వస్తుంటే 15 సంవత్సరాలుగా ఉన్న నియోజకవర్గాన్నీ వదిలి వస్తున్నందుకు బాధేసిందన్నారు. అయితే, పల్నాడు ప్రజలు స్వాగతించిన తీరు చూసి గర్వంగా ఫీల్ అయ్యాన్నన్నారు. జగనన్న తీసుకున్న నిర్ణయం సరైనదేనని చెప్పుకొచ్చారు.

నేను ఒంటరినే..

నన్ను ఫైర్ బ్రాడ్ అంటారు గాని నా జీవితంలో తెలియని బాధలు ఎన్నో ఉన్నాయని.. నేను ఒంటరిని అని ఆవేదన వ్యక్తం చేశారు. త్రికోటేశ్వరుని సాక్షిగా చెబుతున్నా జగనన్నతో 2009 నుండి ప్రయాణిస్తున్నా.. జగనన్న నాకు కొండంత అండగా ఉన్నారన్నారు. జగనన్న నరసరావుపేట వెళ్ళాలి అన్నాడు.. అంతే టైగర్ కా హుకుం అని వచ్చేశానని కామెంట్స్ చేశారు. జగన్ ఆదేశిస్తే ఓడిపోయే సీటు అనుకున్న ప్రాంతానికి కూడా ఖచ్చితంగా పోతానన్నారు. జగనన్న నన్ను ఎమ్మెల్యే చేశాడు, మంత్రిని చేశాడు, రేవు ఎంపీని చేస్తున్నాడని వ్యాఖ్యానించారు.

Also Read: వైసీపీ ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు.. మీ చేతకాని తనానికి ఇలా అడుగుతున్నారా? అంటూ ఫైర్

గొర్రెలు కాసుకునే..

నెల్లూరులో కొందరు ముక్కు సూటిగా, నేరుగా ఉంటావు, ఇక్కడ సెట్టు కావు అంటారని.. అయితే, నాకు సెట్టు అయ్యే ప్రాంతానికే జగనన్న పంపించాడని కొనియాడారు. గొర్రెలు కాసుకునే వాడికి జగన్ మంత్రి పదవి ఇచ్చాడు అన్నారని.. కానీ, భారతదేశం అంత మొక్కేది గొర్రెలు కాసుకునే శ్రీకృష్ణ పరమాత్ముడినేనని వాళ్ళు మరిచిపోయారన్నారు. పల్నాడు ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని నమ్మి మీ దగ్గరకు వచ్చానని పేర్కొన్నారు. నన్ను దీవిస్తారో తెంచుతారో నా భవిష్యత్తు మీ చేతుల్లో పెట్టి వచ్చానని తెలిపారు.

నచ్చినట్టు ఉంటా

మా నెల్లూరులో మీసం తిప్పితే అక్కడి రాజకీయ నాయకులు రౌడీ, గుండా అంటారని.. కానీ మీసం తిప్పితే పౌరుషం అంటారని మరిచిపోయారన్నారు. కానీ పల్నాడులో నచ్చినట్టు పౌరుషంగా ఉంటానని..పంచ కట్టి మీసం తిప్పుతానని..నాకు నచ్చినట్టు ఉంటానని వ్యాఖ్యానించారు. పైనున్న ఆ దేవుడిని, తాడేపల్లిలో ఉన్న ఈ దేవుడుని నమ్మి..ఇక్కడి వరకు వచ్చానని.. తరువాత ఢిల్లీకి పోతానని ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు