ఏపీలో రోడ్ల దుస్థితిపై స్వయంగా వీడియో తీసిన వైసీపీ ఎంపీ.. ఏం చేశాడంటే..?

ఏపీలో రోడ్ల దుస్థితిపై వైసీపీ ఎంపీ బాలసౌరి స్వయంగా వీడియో తీశారు. అంతేకాదు ఆ వీడియోను జగన్ కు పంపించి రోడ్డు వేయించాలని కోరారు. అయితే, కృష్ణా జిల్లా కోడూరు అవనిగడ్డ ఊరులో గత ఏడాది పర్యటించినప్పుడు స్వయంగా రూ. 35 కోట్లు ప్రకటించారు సీఎం జగన్.

ఏపీలో రోడ్ల దుస్థితిపై స్వయంగా వీడియో తీసిన వైసీపీ ఎంపీ.. ఏం చేశాడంటే..?
New Update

YCP MP balasouri : ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితి ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధ్వాన్నమైన రోడ్లతో ఏపీవాసులు నిత్యం నరకం చూస్తున్నారు. ఇక వర్షం పడిందంటే చాలు రోడ్ల సంగతి వర్ణనాతీతంగా మారిపోతోంది.  రోడ్లు బాగుచేయాలని టీడీపీ, జనసేన ఎన్నో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. అయితే, ఇప్పటికి ఏపీలో పలుచోట్ల రోడ్లు భయంకరంగానే ఉన్నాయి.

ఏపీలోని ర‌హ‌దారులు అధ్వానంగా మార‌డంపై “గుడ్ మార్నింగ్ సీఎం సార్” పేరుతో జనసేన డిజిటల్ క్యాంపెన్ నిర్వహించింది. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. రాష్ట్రంలో చేతగాని పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారుతుందని విమర్శలు గుప్పించారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ ఫ్లకార్డులు పట్టుకుని హల్ చల్ చేశారు. టీడీపీ కూడా గుంతల ఆంధ్ర ప్రదేశ్ కు దారేది అనే నిరసన కార్యక్రమం నిర్వహిస్తోంది.

This browser does not support the video element.

Also read: గుక్కెడు మంచినీరు కోసం రోడ్డెక్కిన గ్రామస్ధులు..!

రిసెంట్ గా సీఎం కేసీఆర్‌ సైతం ఏపీ రోడ్లపై విమర్శలు గుప్పించారు. ఏపీ, తెలంగాణలో జరిగిన అభివృద్ధిని పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? డబుల్‌ రోడ్‌ వస్తే తెలంగాణ‌.. సింగిల్‌ రోడ్‌ వస్తే ఏపీ” అని చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి.

తాజాగా, ఏపీలోని రోడ్ల దుస్థితిపై అధికార పార్టీ, వైసీపీ ఎంపీ బాలసౌరి స్వయంగా వీడియో తీశారు. అంతేకాదు ఆ వీడియోను జగన్ కు పంపించి రోడ్డు వేయించాలని కోరారు. అయితే, కృష్ణా జిల్లా కోడూరు అవనిగడ్డ ఊరులో గత ఏడాది పర్యటించినప్పుడు స్వయంగా రూ.35 కోట్లు ప్రకటించారు సీఎం జగన్. అయినా, ఇప్పటికి ఆ రోడ్ల పరిస్థితి మాత్రం అలానే కనిపిస్తోంది.

#ycp-government #andhra-paradesh-roads
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe