AP: కూటమి ప్రభుత్వంపై వైసీపీ నిరసన.. 45 రోజుల పాలనకు వ్యతిరేకంగా..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కూటమి ప్రభుత్వం పాలనకు వ్యతిరేకంగాకు వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. సూపర్ సిక్స్ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందంటూ నినాదాలు చేశారు. ఇప్పటివరకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP: కూటమి ప్రభుత్వంపై వైసీపీ నిరసన.. 45 రోజుల పాలనకు వ్యతిరేకంగా..
New Update

West Godavari: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ప్రకాశం చౌక్ సెంటర్లో కూటమి ప్రభుత్వం 45 రోజుల పాలనకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సూపర్ సిక్స్ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఇప్పటివరకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతుందని రాష్ట్ర నాయకుడు శ్రీనివాసమూర్తి వాపోయారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను సంప్రదించకుండా జిపిఎస్ పై ఉత్తర్వులు జారీ చేయడం, మహిళలకు ఉచిత బస్సును, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం విస్మరించడం ఘోరమన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.  ప్రభుత్వ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామన్నారు వైసీపీ నాయకులు.

#west-godavari-district
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి