YCP Mekapati: మేకపాటికి చేదు అనుభవం.. రసభసగా గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం..! నెల్లూరు జిల్లా గోపన్నపాలెం గ్రామంలో వైసీపీ సమన్వకయకర్త మేకపాటికి చేదు అనుభవం ఎదురైంది. గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను వైసీపీ శ్రేణులే అడ్డుకున్నారు. గ్రామ సమస్యలపై ఎన్నోసార్లు మొరపెట్టుకున్న స్పందించలేదని, అయితే ఇప్పుడెందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 07 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి YCP Coordinator Mekapati: నెల్లూరు జిల్లా జలదంకి మండలం గోపన్నపాలెం గ్రామంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం రసభసగా మారింది. గడపగడప కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజ గోపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గ్రామ సమస్యలపై ఎన్నోసార్లు మొరపెట్టుకున్న ఏ మాత్రం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ వైసీపీ కార్యకర్తలు ఆయనను గట్టిగా నిలదీశారు. Also Read: కడప జిల్లాలో వైసీపీ ఎంపీటీసీ భర్త దౌర్జన్యం.. టోల్‍గేట్ సిబ్బందిపై దాడి..! గ్రామ సమస్యలను ఏనాడు పట్టించుకోని మీరు ఇప్పుడెందుకు వచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుండి వైయస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో పార్టీలు చేరామని తెలిపారు. పార్టీ స్థాపించినప్పుడు నుండి ఉన్నామని, అయితే తమ సమస్యలు ఎన్నిసార్లు తెలిపిన పట్టించుకున్నదే లేదని నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రేమతో ఓట్లు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చామన్నారు. అయితే, జగన్ ప్రభుత్వంలో మా సమస్యలు ఏవీ పరిష్కరం కాలేదని ఫైర్ అయ్యారు. Also Read: నీ అంతు చూస్తా.. ZPTCని ఫోన్ చేసి బెదిరించిన మంత్రి గుమ్మనూరు జరాయం సోదరుడు..! ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఓట్ల కోసం ఇక్కడికి వచ్చారు తప్ప మా బాధలు తెలుసుకోవడానికి కాదని విరుచుకుపడ్డారు. ఇనాళ్లు వైసీపీ అంటే అభిమానం ఉండేదని అయితే, ఇప్పుడు ఏ మాత్రం లేదని తేల్చి చెప్పారు. పార్టీకి సహకరించేదేలేదని, ఓట్లు కూడా వేసేది లేదని మేకపాటికి కరాకండిగా చెప్పారు. కాగా, ఇలా చాలా మంది వైసీపీ మంత్రులకు, నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజల సమస్యలు తీరుస్తేనే వారికి అండగా నిలబడుతున్నారు ఓటర్లు. లేదంటే లేదని తేల్చిచెబుతున్నారు. #ycp-coordinator-mekapati మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి