Yadadri : యాదాద్రి ఆలయ ఇన్‌ ఛార్జ్‌ ఈవో పై బదిలీ వేటు!

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఇన్‌ ఛార్జ్‌ ఈవో రామకృష్ణారావు పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో కొత్త గా అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌ రావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రామకృష్ణారావు ఇంతకు ముందు ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో పని చేశారు

New Update
Yadadri : యాదాద్రి ఆలయ ఇన్‌ ఛార్జ్‌ ఈవో పై బదిలీ వేటు!

Telangana : యాదాద్రి(Yadadri) లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) ఆలయ ఇన్‌ ఛార్జ్‌ ఈవో రామకృష్ణారావు(EO Ramakrishna Rao) పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో కొత్త గా అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌ రావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే... మార్చి 11న ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) తో పాటుగా రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), కొండా సురేఖ(Konda Surekha) తదితరులు ఉన్నారు.

స్వామి వారి దర్శనం , పూజా అన్ని అయిన తరువాత వేద పండితులు ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులకు వేద ఆశీర్వాచనం ఇచ్చారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం భట్టికి, మంత్రి కొండా సురేఖకు ఆలయాధికారులు చిన్న పీటలు వేశారు. ఈ విషయం గురించి రాష్ట్ర రాజకీయాలతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా పెద్ద ఎత్తున రచ్చ చేశారు.

కావాలనే భట్టిని, కొండా సురేఖను అవమానించారని పేర్కొన్నారు. ఈ అంశం బాగా సీరియస్‌ అవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆలయ ఇన్‌ఛార్జ్‌ ఈవోగా ఉన్న రామకృష్ణారావుని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ విషయం గురించి భట్టి విక్రమార్క స్పందించారు. ఇందులో ఆలయాధికారులు తప్పు లేదని, నేనే కావాలని చిన్న పీట మీద కూర్చున్నట్లు వివరించారు.

రామకృష్ణారావు ఇంతకు ముందు ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో పని చేశారు. ఈ ఘటనతో ఆయన బదిలీ కావడంతో ఆయన స్థానంలో అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌ రావుని ఆలయ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది.

Also Read : వైసీపీ ఫైనల్‌ లిస్ట్‌ డేట్‌ ఫిక్స్ చేసిన అధిష్టానం…ఎప్పుడు ..ఎక్కడ నుంచి అంటే!

Advertisment
తాజా కథనాలు