షావోమీ 14 సీవీ ఫోన్ ఈ నెల 12న ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అవ్వనుంది. ఈ మొబైల్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ కస్టమ్ యూఐపై రన్ అవుతుంది. షావోమీ 14 సీవీలో 6.55 అంగుళాల 1.5 కె అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది. అలాగే స్క్రీన్కు కార్నింగ్ గొరిల్లా విక్టస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. కెపాసిటివ్, మల్టీ టచ్ ఫీచర్లు ఉన్నాయి. మొబైల్ కెమెరాల విషయానికొస్తే ఇందులో వెనుక రెండు 50 ఎంపీ సెన్సార్లతో పాటు ముందువైపు కూడా డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు ఉండనున్నాయి. వెనుకవైపు లైకా బ్యాక్డ్ సెన్సార్లు, ముందువైపు రెండు 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాలు అమర్చారు.
పూర్తిగా చదవండి..ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతున్నషావోమీ 14 సీవీ..ఫీచర్లివే
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీ.. ‘షావోమీ 14 సీవీ’ పేరుతో సరికొత్త ప్రీమియం మొబైల్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. రెండు సెల్ఫీ కెమెరాలతో వస్తున్న ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.43,000 గా మార్కెట్లోకి రానుంది.
Translate this News: